Amravati, Mar 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు నీలం సాహ్ని పేరును (Andhra Pradesh new SEC) గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) స్థానంలో సాహ్ని పదవీ బాధ్యతలు తీసుకుంటారు. నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెాఖరుతో ముగుస్తుండటంతో ఏపీ సర్కారు ఈ నియామకం చేపట్టింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని (Andhra Pradesh chief secretary Nilam Sawhney) ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించిన సంగతి తెలిసిందే. కాగా, 2019 నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆమె (Neelam Sahni) తొలి పోస్టింగ్ మచిలీపట్నంలోనే జరిగింది. ఆ తర్వాత మళ్లీ సీఎస్ గా సాహ్ని ఏపీకి వచ్చారు. ఇప్పుడ ఏపీ ఈసీగా సేవలు అందించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయి అప్పట్లో ఆమె సరికొత్త ఘనత సాధించారు. అంతకుముందు సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.
Here's Update
ఆంధ్రప్రదేశ్ కొత్త ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని గారు నియామకం...
ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసిన గవర్నర్ హరిచందన్ గారు.#CMYSJagan #AndhraPradesh #YSJagan #NeelamSahni pic.twitter.com/Q54ux7SFri
— Jagan Followers (@jagan_followers) March 26, 2021
ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కుడిచేతి చూపుడువేలికి సిరా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన లోక్‌సభ స్థానానికి వచ్చే నెల 17న జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతి ఎన్నికల్లో ఓటేసే ఓటరుకు అధికారులు ఎడమచేతి చూపుడు వేలికి సిరా వేయటం ఆనవాయితీగా వస్తోంది.
ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఓటర్ల ఎడమచేతి వేలికి వేసిన ఇండెలిబుల్ సిరా ఇంకా కొందరికి చెరిగిపోలేదు. అటువంటి వారు ఓటు వేసేందుకు వెళితే పోలింగ్ అధికారులు వెనక్కుపంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికలసంఘం నుంచి ఉత్తర్వులు అందాయి.