Nellore, May 11: నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియలోని (Chandrapadiya village) మంగళవారం తెల్లవారుజామున ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై (Nellore Toxic Gas Leak) ముగ్గురు దుర్మరణం చెందారు. చంద్రపడియాలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో (Venkata Narayana Active Ingredients) రియాక్టర్ లోనికి వెళ్లే గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాగా కెమికల్ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై అవడంతో ముగ్గురు విష వాయువును పీల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
మృతులను వింజామూర్‌కు చెందిన ఎస్.షరీఫ్, పి.శ్రీను, చౌతా భీమవరం నుంచి తిరుపతయ్యగా గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించింది. వారిలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. గత జూలైలో అదే కర్మాగారంలో బాయిలర్ పేలినప్పుడు ఒకరు మరణించారు మరియు ముగ్గురు గాయపడ్డారు.