cbi-files-case-against-dr-sudhakar-for-violating-lockdown (Photo-Video grab)

Amaravati, June 4: నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల మీద నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్‌ సుధాకర్‌పై కేసు (Vizag Anesthetist Case) నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని (FIR Copy) బుధవారం పొందుపర్చింది. ఈ రోజు రూ.10 వేలు నేరుగా అకౌంట్లోకి.., వైఎస్సార్ వాహన మిత్ర రెండో దఫా మొత్తాన్ని విడుదల చేసిన ఏపీ సర్కారు, 4 నెలల ముందుగానే విడుదల

గత నెల 16న డాక్టర్‌ సుధాకర్‌ (Dr Sudhakar Rao Case) విశాఖ పోర్టు ఆస్పత్రి సమీపంలోని జాతీయ రహదారిపై తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని ఫోర్త్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాఘవేంద్ర కుమార్‌ ఎఫ్‌ఐఆర్‌ ప్రతిలో పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపిన సీబీఐ

కాగా హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటరమణ ఘటన జరిగిన రోజే సుధాకర్‌పై ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని అందులో పొందుపరిచారు. దీంతో డాక్టర్‌ సుధాకర్‌పై ఐపీసీ 353 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం), 427 (తుంటరి చేష్టలతో న్యూసెన్స్‌ సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం), 506 (ఎదుటి వ్యక్తులను నేరపూరితంగా బెదిరిస్తూ భయోత్పాతం సృష్టించడం) మొదలైన సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది.  శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జూన్ 8న తెరుచుకోనున్న శ్రీవారి ఆలయ తలుపులు, ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు

నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్‌ ఏప్రిల్‌ 6వ తేదీన కరోనా నియంత్రణపై ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. మే 16వ తేదీ సాయంత్రం 3.50 ప్రాంతంలో డాక్టర్‌ సుధాకర్‌.. విశాఖ నగరం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్‌లో ఉన్న తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిలో కారు ఆపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడారు. యత్నం చేశారు. అయినా వినిపించుకోకుండా మతం, కులాల పేరిట దూషిస్తూ ప్రధాని, సీఎం, మంత్రులతో పాటు పోలీసులను, అక్కడ ఉన్న స్థానికుల్ని సైతం విమర్శలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వీడియోలో కూడా బయటకు వచ్చాయి.