Srikakulam Shocker: లాక్‌డౌన్ ఆంక్షలు..విధిలేక తల్లి మృతదేహాన్ని 3 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లిన కుమారుడు, శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన, కంటైన్‌మెంట్ జోన్‌గా శ్రీకాకుళం నగరం
family forced to take woman's Dead body on bike (Photo-Video Grab)

Srikakulam, April 27: కరోనా విశ్వరూపానికి దేశం అల్లాడుతోంది. రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఎక్కడికక్కడే ఆంక్షలు విధిస్తున్నారు.లాక్‌డౌన్, ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. తాజాగా ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఓ విషాద వీడియో (Srikakulam Shocker) బయటకు వచ్చింది. తల్లి మృతదేహాన్ని (woman's Dead body) ద్విచక్రవాహనంపై కొడుకు 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన జి.చెంచుల అనే మహిళ ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో కుమారుడు మరో వ్యక్తి సహాయంతో ద్విచక్రవాహనంపై పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకువెళ్లాడు. ప్రథమ చికిత్స తర్వాత స్కానింగ్ కోసం కాశిబుగ్గ గాంధీనగర్‌లో ఉన్న శ్రీకృష్ణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ చేసిన అనంతరం తల్లి మృతి చెందింది. అయితే పలాస, కాశీబుగ్గ పట్టణంలో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించారు.

నాకు సుఖం లేదు, మీరెందుకు బతకాలి? అమ్మ,చెల్లి,తమ్ముడిని దారుణంగా హత్య చేసిన సైకో, పొద్దుటూరులో కిరాతక ఘటన, వాడిని ఉరి తీయాలంటూ తండ్రి ఆవేదన

కాగా చెంచుల కరోనాతో మృతి చెందిందని మృతదేహాన్ని స్వగ్రామం కిల్లోయి తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, అంబులెన్స్ సిబ్బంది గానీ ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తున్నామని కొడుకు పోలీసులకు తెలియజేశాడు.

Here's Video

ఇక శ్రీకాకుళంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు. అలాగే శ్రీకాకుళం నగరం మొత్తాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మంగళవారం నుంచే ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు. జిల్లాలోని మొత్తం కేసుల్లో ముప్పై శాతం కేసులు శ్రీకాకుళం నగరంలోనే నమోదు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రానున్న 14 రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.

జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకునే దిశలో చర్యలు చేపడుతోంది. తొలి విడతలో కూడా పోలీసు శాఖ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసింది. గడిచిన రెండు రోజులుగా రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కరోనా తీవ్రత ఉన్న నగరాలు, పట్టణాలు, మేజర్‌ పంచాయతీలపై దృష్టి సారించి రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.

కరోనా కల్లోలం..ఏపీ సర్కారు కీలక నిర్ణయం, 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చేందుకు ఏర్పాట్లు, 104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు

జిల్లా ఎస్పీ నుంచి ఏఎస్పీలు, డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ గస్తీని పరిశీలిస్తున్నారు. మాసు్కలు లేకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. మాసు్క లు లేకుండా ట్రిపుల్‌ రైడింగ్, డబుల్‌ రైడింగ్‌ చేస్తే కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం రాత్రి, ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ నగరంలోని ప్రధాన కూడళ్లలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం నుంచి మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని దొండపాడు శ్మశాన వాటికలో కరోనా మృతదేహాలకు దహనకాండలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజుల్లో జిల్లాలో పదమూడు మంది కరోనాతో మృతి చెందడం కలకలం రేపుతోంది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రుల కమిటీ రేపు సమావేశం కానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఈ కమిటీకి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై పర్యవేక్షణ కోసం ఏపీ సర్కారు ఐదుగురు మంత్రులతో ఇటీవలే కమిటీ వేసింది. ఆళ్ల నాని కన్వీనర్ కాగా... బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులు.

తాజాగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ, రేపటి సమావేశంలో కీలకమైన అంశాలను చర్చిస్తామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్ డెసివిర్ అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా, మంత్రుల కమిటీ గత నెలలోనూ సమావేశమై కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేపట్టింది.