Amaravati, April 24: దేశంలో కరోనావైరస్ విశ్వరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూలు వంటివి విధిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. రాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ కోసం చాలా మంది ప్రభుత్వానికి విరాళాలు (1,33,34,844 donations were received ) అందజేస్తున్నారు. ఇందులో భాగంగా కోవిడ్–19 నియంత్రణ చర్యల కోసం ఏపీలొ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళం (1 Crore to CM Relief Fund) వచ్చింది.
ఈ విరాళం ఇచ్చిన వారిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు(Kurasala Kannababu) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి (CM YS Jagan) అందజేశారు.
విరాళాలు అందజేసిన సంస్థల్లో.. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, విజయవాడ రూ. 14,20,000 డొనేట్ చేశారు. ఏపీ ఆయిల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పీవీఎస్‌ఎస్ మూర్తి రూ. 15,00,000, కాళేశ్వరీ రిఫైనరీ అండ్ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్ రూ. 25,00,000, కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ రూ. 1,00,000, భవాని కాస్టింగ్స్ ప్రై.లిమిటెడ్ రూ. 5,00,000, వేద సీడ్ సైన్స్ ప్రై.లిమిటెడ్ రూ. 10,00,000 విరాళాల రూపంలో ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేసిన వాటిలో ఉన్నాయి.
కోవిడ్ వ్యాక్సిన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు అవసరమైనన్ని కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లకు ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 18 – 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2,04,70,364 మందికి టీకా ఇవ్వాల్సి ఉన్నందున ఆ మేరకు డోసులు సేకరించాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.