Former MP Undavalli Arun Kumar (Photo-Video grab)

Amaravati, Oct 17: రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ (NV Ramana) కంట్రోల్ చేస్తున్నారని, ఆయన డైరక్షన్ ద్వారానే ఏపీ హైకోర్టు తీర్పులు వెలువడుతున్నాయని ఏపీ సీఎం వైయస్ జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బాబ్డేకు లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ప్రకంపనలు రేపుతోంది. ఏపీ సీఎం లేఖపై చర్చ జరగాలని మెజార్టీ న్యాయవాదులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Former MP Undavalli Arun Kumar) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీ సీఎం జగన్‌ రాసిన లేఖలోని అంశాలు ప్రజలకు తెలియాలని అన్నారు. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్ (High Court Gag order) ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. కోర్టు డీజీపీని పిలిపించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గతంలో జడ్జీలపై ఎఫ్‌ఐఆర్‌ కట్టిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మార్గదర్శి కేసు సుప్రీంకోర్టులో విచారణ రాకుండా చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై చర్చ జరగాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థలు ఒక్కటేనని అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

సీఎం వైయస్ జగన్ లేఖ ప్రకంపనలు, చర్యలు తీసుకోవాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా డిమాండ్‌, ఢిల్లీ లాయర్ ఇంటిపై ఐటీ దాడులు, 217 కోట్ల రూపాయలు స్వాధీనం

దీంతో పాటుగా ప్రజాప్రతినిధుల కేసులను వర్చువల్‌ కోర్టుల్లో విచారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. వర్చువల్‌ కోర్టులపై తన సూచనలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి మెయిల్‌ చేశానని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో కోర్టు ప్రక్రియ లైవ్‌ టెలీకాస్ట్‌లో చూపించాలని సూచించారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కేసులు ప్రజలకు తెలియాలని అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎంలు లేఖలు రాయడం కొత్తమీకాదని వ్యాఖ్యానించారు.

పలుకుబడి వున్నంత కాలం ప్రజాప్రతినిధుల కేసులు దాచేవారని, ఇప్పటికైనా విచారణకు సుప్రీంకోర్టు చర్యలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇపుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసు ట్రయల్ కు వస్తుందని ఆయన తెలిపారు. సీఎం జగన్ ముద్దాయిగా ట్రయల్ కు నడవబోతున్నారని ఆయన అన్నారు. ఏపీ ప్రజాప్రతినిధులు కేసులు విచారణ లైవ్ టెలికాస్ట్ పెట్టాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ కు లేఖలో ఈ అంశం రాశానని ఆయన స్పష్టం చేసారు. లైవ్ టెలికాస్ట్ పెడితే అనేక మంది ఖర్చు భరించడానికి ముందుకు వస్తారని ఆయన అన్నారు.

ఏపీ సీఎం వైయస్ జగన్ లేఖలో ఏముంది? న్యాయవ్యవస్థపై చర్చ మరోసారి తెరపైకి, ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న పలువురు ప్రముఖులు, సీజేఐ ఎస్‌ఎ బాబ్డే ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి

కోర్టులో జరిగింది జరిగినట్లు చూపిస్తే ప్రజలలో కేసులపై అవగాహన వస్తుందని అన్నారు. సీఎంగా సంజీవయ్య ఉన్న సమయంలోనే న్యాయమూర్తులపై ఇలాగే ఒక లేఖ రాశారని ఆయన తెలిపారు. జగన్ రాసిన లేఖ కొత్తదేమీ కాదు సంజీవయ్య లెటర్ పై నాడు హోంమంత్రి కి రాశారన్నారు. సంజీవయ్య రాజీనామా చేసేవరకూ ఆ లేఖపై స్పందన లేదన్నారు. సంజీవయ్య రాసిన లేఖ దరిమిలా న్యాయమూర్తులు చంద్రారెడ్డి, సత్యనారాయణ రాజులను బదిలీలతో పాటు పదోన్నతులు వచ్చాయన్నారు.

చీఫ్ జస్టీస్ కు రాసిన లేఖ గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం సరికాదన్నారు. ప్రజల వద్దకు ఈ అంశం వెళ్ళాలనే ఇలా చేసివుంటారన్నారు. రెడ్డి లాబీయింగ్ బలంగా వున్న సమయం కాబట్టే 1965లో ఆ న్యాయమూర్తుల విషయంలో అలా చేశారన్నారు. జడ్జిమెంట్ల విషయంలో న్యాయమూర్తుల ప్రమేయం వుంటుందని నేను విశ్వసించనని అన్నారు.

న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వం ఢీ, ఏపీ హైకోర్టు జడ్జీల తీర్పుల తీరుపై సీజేఐకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం

గ‌తంలో ఎన్టీఆర్ ప్ర‌జా సేవ చేయాల‌నుకుంటే కోర్టులు అడ్డుపడుతున్న‌ట్లు భావించాడ‌న్నారు. కోర్టులు అడ్డుప‌డుతున్నాయ‌నుకున్న ఎన్టీఆరే ఆ త‌ర్వాత కోర్టు తీర్పుల‌కు లోబ‌డి ప్ర‌జా సేవ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ హుందాగా జ‌ర‌గాల‌ని, ప్ర‌భుత్వం-న్యాయ వ్య‌వ‌స్థ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌లు ప్ర‌జ‌లకు మేలు చేయ‌వ‌న్నారు