Credits: Twitter

Vizag, April 14: విశాఖపట్నంలోని (Vizag) గీతం యూనివర్సిటీ (Gitam University) వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి (University) నలువైపులా పోలీసుల (Police) మోహరింపు భారీగా జరిగింది. వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు. అటువైపు ఎవ్వరిని రానివ్వకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో గీతం యూనివర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో ప్రభుత్వం స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. మెుత్తం కిలోమీటర్‌ పొడవునా ప్రభుత్వ యంత్రాంగం కంచె వేసింది.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మూడోసారి కరోనా.. నిన్ననే పుణె నుంచి హైదరాబాద్ వచ్చిన పోసాని.. అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు

స్థలమంతా ప్రభుత్వానిదే!

కంచె వేస్తున్న స్థలమంతా ప్రభుత్వానిదేనని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో గీతం కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీన పరుచుకున్నారు. దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు అప్పట్లో భీమిలి ఆర్డీవో భాస్కర్​రెడ్డి వివరించారు. రుషికొండ గ్రామ సర్వే నెం.37, 38లోని స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్డీవో వివరించారు.

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం.. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌ లో వర్షం బీభత్సం.. మరో మూడు రోజుల పాటు వానలు