Republic Day Celebrations in AP&TS: మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ఏపీ గవర్నర్, తెలంగాణలో ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Republic Day Celebrations in Telugu States (Photo-Twitter)

Amaravati. Jan 26: రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations in Telugu States) కనువిందుగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌‌ హరిచందన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రులు, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్ (AP Governor Bishwabhushan Harichandan) ప్రసంగిస్తూ... రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన అజెండాతో ఉంది. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మా సిద్ధాంతం. కొందరు ప్రజల మధ్య శాంతిని చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి వారిని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే నవరత్నాల్లో ప్రకటించాం.

రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికోసం ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా డిసెంబర్‌ 25న 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాం. రెండు దశల్లో పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ప్రతి నెలా ఒకటో తేదీనే అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నాం. అధికార వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తాం. విజయవాడను శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తాం. కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తాం’ అని గవర్నర్‌ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 14 శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. వివిధ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకుంటున్నాయి.

దేశ ప్రజలకు జైహింద్ అంటూ ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, వేడుకల్లో కనువిందు చేయనున్న ఏపీ లేపాక్షి ఆలయం, యూపీ రామమందిరం, గణతంత్ర దినోత్సవ‌ వేడుకల ప్రత్యక్ష ప్రసారం లింక్ కోసం క్లిక్ చేయండి

గణతంత్ర దినోత్సవం (Republic Day Celebrations) సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం మెడల్స్‌ ప్రకటించింది. ఏపీకి రెండు పోలీస్‌ శౌర్య పతకాలు, ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకంతో పాటు 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఏఏసీ ర్యాంకు అధికారి గొంగటి గిరీష్‌ కుమార్, జేసీ ర్యాంకు అధికారి కూడుపూడి హరికృష్ణకు పోలీసు శౌర్య పతకాలు వచ్చాయి. విజయవాడ ఏసీబీ అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాథుర్తి శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం దక్కింది.

తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలు

తెలంగాణలో ప్రగతి భవన్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీఎం రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. నిజ‌మైన స‌మాఖ్య‌స్ఫూర్తి ప‌రిఢ‌విల్లేలా భార‌త ప్ర‌జాస్వామ్య గ‌ణ‌తంత్ర వ్య‌వస్థ బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షిస్తూ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

భారత గణతంత్ర దినోత్సవం 2021 వేడుకలకు సర్వం సిద్ధం, అబ్బురపరిచేలా సైనిక విన్యాసాలు, రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్న రఫేల్ యుద్ధ విమానాలు

72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లాలోని చారిత్రాత్మక బురుజుపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బురుజుపై జాతీయజెండా ఎగుర వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవలనే ఉద్దేశంతో వాటిపై జాతీయ జెండా ఎగురవేశామని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. హైదరాబాద్‌ అదనపు సీపీ శిఖా గోయల్, నిజామాబాద్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను దక్కించుకున్నారు.

గల్వాన్‌ లోయలో గత ఏడాది చొరబాటుకు యత్నించిన చైనా బలగాలను దీటుగా ఎదుర్కొని.. ఆ సమయంలో చెలరేగిన ఘర్షణలో అసువులు బాసిన కల్నల్‌ సంతోష్‌ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్‌ చక్ర అవార్డును ప్రకటించింది. సైన్యంలో యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత పతకం పరంవీర్‌ చక్ర కాగా.. ఆ తర్వాతి స్థానం మహావీర్‌ చక్రకు ఉంది. కల్నల్‌ సంతోష్‌ బాబు 16వ బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా గల్వాన్‌ వద్ద విధుల్లో ఉండగా.. గత ఏడాది జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన సంగతి తెలిసిందే.