 
                                                                 New Delhi, Jan 19: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో TDP అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. ఫిబ్రవరి 9వ తేదీకి విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఫిబ్రవరి 9న తనకు మరో పని ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే, ఫిబ్రవరి 12కు వాయిదా వేయాలని హరీశ్ సాల్వే విజ్ఞప్తి చేయడంతో.. ధర్మాసనం అంగీకరించింది.ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
కంటి చికిత్స, ఇతరత్ర ఆరోగ్య సమస్యల దృష్ట్యా స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు అక్టోబర్ 31వ తేదీన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆపై ఆ బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మారుస్తూ నవంబర్ 20వ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు తన పరిధిని మీరిందని పేర్కొంటూ ఆ మరుసటిరోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.ఏపీ ప్రభుత్వం స్కిల్ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో నారా చంద్రబాబు నాయుడిని ప్రతివాదిగా చేర్చింది. ఈ ఎస్‌ఎల్‌పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
