Family of Three Commits Suicide Under Goods Train in Andhra Pradesh (Photo-Chota News)

ఏపీలోని కడప జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం మొత్తం గూడ్స్‌ రైలు(Goods Train) కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. కడప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్‌ సమీపంలోని మూడో నంబర్‌ ట్రాక్‌పై ఓ కుటుంబం గూడ్స్‌ రైలుకు ఎదురుగా నిల్చోగా.. రైలు ఢీకొట్టడంతో అందరూ అక్కడిక్కడే మృతిచెందారు. మృతదేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడ్డాయి.

షాకింగ్ వీడియో ఇదిగో, బైకుపై వెళుతూ రైలు పట్టాలు క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి, రైలు దూసుకురావడంతో దాని కింద పడి నుజ్జు నుజ్జు, నోయిడాలో ఘటన

ఈ షాకింగ్ వార్త తెలుసుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మృతులను శంకరాపురానికి చెందిన శ్రీరాములు, శిరీష, రిత్విక్‌‌గా గుర్తించారు. భార్యాభర్తలు గొడవపడగా.. ఇద్దరిని శ్రీరాములు నానమ్మ మందలించినట్లు సమాచారం. దీంతో కోపంలో ఇంటి నుంచి రాత్రి బయటకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 Family of Three Commits Suicide Under Goods Train

ఇక శ్రీరాములు కుటుంబం మరణ వార్త విని నానమ్మ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీరాములు కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన కోణంలోనే పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీరాములు మెడికల్ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు సమాచారం.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.