Chandrababu Naidu (Photo-Video Grab)

Vjy, Sep 11: చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులోవాదనలు ముగిశాయి. తాజాగా చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కాగా చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను బాబు తరపు న్యాయవాదులు ఉదహరించగా కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలను న్యాయమూర్తి అడిగారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్ దాఖలైంది. సిట్ కార్యాలయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి అంటూ పిటిషన్లో పేర్కొన్నారు.

సెక్షన్ 207 సీఆర్పీసీ ప్రకారం అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీపీ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదంటూ మండిపడ్డారు. వరుస పిటిషన్లు వేస్తే విధులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మధ్యాహ్నం 12 లోపు పిటిషన్ దాఖలు చేయాలని తెలిపారు. నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినమని చెప్పడం సరికాదన్నారు.

ఈ ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది, ఎవర్నీ వదలిపెట్టే ప్రసక్తే లేదు, టీడీపీ అధినేత తనయుడు నారా లోకేశ్‌ వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించగా, ఏపీ సీఐడి తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కన్నా జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని కోర్టుకు వివరించారు.

పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం, పీవీ రమేశ్ స్టేట్ మెంట్‌తోనే కేసు నడవడం లేదని తెలిపిన సీఐడీ వర్గాలు

ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామని తెలిపారు. జైల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు భద్రత ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటలూ పోలీసులు విధుల్లోనే ఉంటున్నారని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలను ప్రభావం చేసే అవకాశం ఉండటం వల్ల.. చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు.

అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు

►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు

►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం

►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది

►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా

►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే

►చంద్రబాబు కోరిన‌ విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి

►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది

►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి

►ఈ‌ పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు

►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది

AG పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు

►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ...అక్కడికి ఎవరు రాలేరు....?

►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు

►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు

►కాబట్టి చంద్రబాబుకు హౌజ్‌ అరెస్ట్ అవసరం లేదు

►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది

►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది

►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

కేసు డాక్యుమెంట్లు కావాలి : సిద్ధార్థ్‌ లూథ్రా

చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్‌జీ భద్రతలో ఉన్నారు

►చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది

►హౌజ్‌ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది

►గౌతం నవార్కర్ కేసు పరిశీలించండి

►హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయి

►చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి

► స్కిల్ కుంభకోణం కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కావాలి

►సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి

►సెక్షన్ 207 సీఆర్పీసీ ప్రకారం అనుమతి ఇవ్వాలి

►పిటిషన్ వేసిన లాయర్‌ సిద్దార్ద లూథ్రా