Supreme Court. (Photo Credits: Wikimedia Commons

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన పేరును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. సర్వోన్నత న్యాయస్థానంలోని 6వ నంబర్‌ కోర్టులో ఐటం నంబర్‌ 63 కింద ఈ కేసును లిస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్‌పై.. కేవియట్ దాఖలు చేసి విచారణలో భాగమైంది ఏపీ ప్రభుత్వం. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు వినతి చేసింది.

ఇక ఇన్నర్‌రింగ్‌ రోడ్డు స్కామ్‌ కేసులో ఏపీ హైకోర్టులో బాబు పిటిషన్‌ విచారణకు రానుంది. ఐఆర్‌ఆర్‌ స్కాంలో ఏ1గా చంద్రబాబును పేర్కొన్న సంగతి విదితమే.మరోవైపు ఏ2 నారాయణ ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై కూడా విచారించనుంది. రేపు నారాయణ-నారా లోకేష్‌ను విచారించనున్న ఏపీ సీఐడీ. ఇందులో భాగంగా ఇప్పటికే వారికి నోటీసులు అందజేసింది.

టైమ్స్‌ నౌ తాజా సర్వే ఫలితాలు ఇవిగో, ఏపీలో మళ్లీ జగన్ సర్కారే, తెలంగాణలో కారు జోరు, కేంద్రంలో మళ్లీ ఎన్టీయే ప్రభంజనం అంటున్న సర్వే..

ఇక నేడు సుప్రీంకోర్టులో పుంగనూరులో పోలీసులపై టిడిపి నేతల దాడి కేసు విచారణ జరగనుంది. నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి విదితమే.టీడీపీ నేతలు దేవినేని ఉమ, పులివర్తి నాని, నల్లారి కీషోర్ కుమార్ రెడ్డికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దాడి కేసులో చల్లా బాబు పై 7 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో చల్లా బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

ఇక నేడు సుప్రీంకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణకు రానుంది. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ పట్టుబడిన కేసులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ఈ కేసు విచారించనుంది. ఐటెం నెం.42 గా కేసు లిస్ట్ అయింది.ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టేయాలని అంటున్న రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని అంటున్న తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.