సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా పడింది. ఏప్రిల్ 16న ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.
నేడు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దుపై ఏప్రిల్ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం ఖాయం..ఎన్డీయేకు 400 సీట్లు ఖాయం..10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్..సీఎం జగన్ పై విమర్శలకు మోదీ దూరం..చిలకలూరిపేటలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్ ఇవే..
అధికారులను, దర్యాప్తు సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తన పిటిషన్ లో పేర్కొంది. రెడ్ డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. ఎన్నికలకు ముందు పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయడం చంద్రబాబుకు ఊరటగానే చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది.