Amaravati, June 10: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కరణం బలరాం (Karanam Balaram) ప్రకంపనలు మరవక ముందే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు (DP Ex-Minister Sidda Raghava Rao) బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ పార్టీలో చేశారు. వైసీపీలోకి 10 నుంచి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబుతో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (AP CM YS Jagan)వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
Here's Video
మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు ఇద్దరికీ వైయస్ జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.#YSRCP #APCMYSJagan #SiddaRaghavaRao pic.twitter.com/HEPyiV4zSg
— Shailaja Reddy (@ShailajaReddi) June 10, 2020
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా శిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాను. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.