Hyderabad Metro Timings Changed: హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు, ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌, సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌, సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు
Hyderabad Metro Rail (Photo-wikimedia commons)

Hyderabad, June 9: తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు (Hyderabad Metro Timings Changed) చేశారు. మారిన సమయం ప్రకారం ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా డిపోలకు మెట్రో రైళ్లు చేరుకోనున్నాయి. కాగా, కరోనా రెండో వేవ్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను (Telangana lockdown) పొడిగిస్తూ, పలు సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు నేటివరకు వరకు ఉండగా.. మరో 10 రోజులపాటు పొడిగించింది. సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్థానాలకు చేరుకునేందుకు మరో గంటపాటు అదనంగా సమయం ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం.. జూన్ నెల నుంచే వేతనాల పెంపు అమలు, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల మంజూరు, వ్యవసాయ భూముల డిజిటలైజన్, తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు ఇవే!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు జరిగిన కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్ర సరిహద్దుల్లోని సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ప్రస్తుతమున్న తరహాలోనే.. మిగతా పది రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.