Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, Nov 26: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States Coronaviurs) తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ (Covid Second Wave) ఎదుర్కునేందుకు ప్రజలంతా తగిన జాగ్రత్తలతో రెడీ కావాలని పిలుపునిస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాల్లో కరోనా వివరాలను పరిశీలిస్తే..

ఏపీలో గడచిన 24 గంటల్లో 60,726 కరోనా టెస్టులు నిర్వహించగా 831 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 145 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 12 కేసులు వచ్చాయి. పశ్చిమ గోదావరిలో 135, తూర్పు గోదావరిలో 126, విజయనగరంలో 18, శ్రీకాకుళం జిల్లాలో 23, కర్నూలు జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,176 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 8,64,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,45,039 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,673 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మరణాల సంఖ్య 6,962కి పెరిగింది.

తీరాన్ని తాకిన నివర్ తుఫాను, అయినా పొంచి ఉన్న పెనుముప్పు, తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు, పలు రైళ్ల రాకపోకలు రద్దు, తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు

తెలంగాణలో గత 24 గంటల్లో 862 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 961 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,904కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,54,676 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,444కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,784 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,507 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 57 కేసులు నిర్ధారణ అయ్యాయి.