AP MAP (photo-wikimedia commons)

Vijayawada, April 03:  ఏపీ రాష్ట్రంలో కొత్త జిల్లాలు (New Districts), రెవెన్యూ డివిజన్లపై (Revenue Divisions) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తుది నోటిఫికేషన్లు సిద్ధం చేసింది.దీనిపై గెజిట్ విడుదల చేసింది. జనవరి 25న సీసీఎల్‌ఏ (CCLA) విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ల ఆధారంగా మొత్తం 26 జిల్లాలు ఉండనున్నాయి. ప్రతి లోక్‌సభ స్థానాన్నీ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా పార్వతీపురం మన్యం జిల్లాను (Manyam District) ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరుకుంది. రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 73కి చేరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 52 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అందులో ఎటపాక, కుక్కునూరు డివిజన్లను తాజాగా రద్దు చేశారు.

New Districts in AP: ఏపీలో 26 జిల్లాల పూర్తి సమాచారం, ఏ నియోజకవర్గం ఏ జిల్లాకు వెళుతోంది, ముఖ్య కేంద్రంగా ఏదీ ఉండబోతోంది, ఏపీలో కొత్త జిల్లాలపై సమగ్ర కథనం

కొత్తగా మరో 23 డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. జనవరి 25న ప్రకటించిన 15 కొత్త డివిజన్లపై రాబోయే రెండు రోజుల్లో తుది నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని సమాచారం. తాజాగా ప్రకటించిన పలాస, చీపురుపల్లి, కొత్తపేట, ఉయ్యూరు, సత్తెనపల్లి, నగరి, శ్రీకాళహస్తి, పత్తికొండ.. ఈ ఎనిమిది డివిజన్లపై కొత్తగా అభ్యంతరాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. అధికారులు ప్రాథమిక నోటిఫికేషన్లు ఇస్తారా ? లేక జిల్లాలనే ప్రామాణికంగా తీసుకుని అన్నింటిపైనా తుది నోటిఫికేషన్లు జారీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Andhra Pradesh: ఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు, గ్రూప్‌ 1,2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

జిల్లాలనే యూనిట్‌గా తీసుకుని తుది నోటిఫికేషన్లు తయారు చేసినట్లు తెలిసింది. ధర్మవరం, కదిరి, కందుకూరు రెవెన్యూ డివిజన్లను కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసింది. మొత్తం 26 జిల్లాల్లో 4 జిల్లాల పరిధిలో నాలుగేసి రెవెన్యూ డివిజన్లు.. 13 జిల్లాల పరిధిలో మూడేసి.. 9 జిల్లాల్లో రెండేసి డివిజన్లు ఉండనున్నాయి.

కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు 

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి