Telugu States Covid Updates: తిరుపతి ఎమ్మెల్యే భూమనకు కరోనా, జగిత్యాల అడిషనల్‌ ఎస్పీ కోవిడ్‌తో మృతి, మహబూబాబాద్‌ కలెక్టర్‌కు కరోనా
Tirupati MLA Bhumana Karunakar Reddy and Jagtial Additional SP Dakshinamurthy (Photo-File Photo)

Amaravati, August 26: తిరుపతి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) కరోనావైరస్ బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు.

కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఆయనకు కూడా పాజిటివ్ (Bhumana Karunakar Reddy tests positive for Coivd) రావడంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన మొదలైంది. ఏపీలో 3 లక్షల 71 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య

జగిత్యాల జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి (Jagtial Additional SP Dakshinamurthy) కరోనాతో మృతి చెందారు. వారం రోజుల కిత్రం కోవిడ్‌ బారిన ప‌డిన ఆయ‌న‌.. క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ద‌క్షిణామూర్తి ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస (SP Dakshinamurthy Dies Of Covid 19 virus) విడిచారు. 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. తెలంగాణలో 1,11,688కి చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య

నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా పని చేశారు. ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దక్షిణ మూర్తి ఆకస్మిక మృతితో జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమావేశంలో కలెక్టర​ గౌతమ్‌తో సహా.. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ పాల్గొన్నారు. అధికారల సూచనలతో వారంత పరీక్షలు చేయించుకోనున్నారు.