Tirumala Nov 29: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం (Dollar Seshadri dies of cardiac arrest in Visakhapatnam) చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస (Dollar Seshadri No More) విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు. విశాఖ కేజీహెచ్‌లో ఉన్న డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతికి తరలిస్తున్నారు. రేపు తిరుపతి గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
రేపు మధ్యాహ్నం డాల్లర్ శేషాద్రి అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దీవదేహం బయలుదేరనుంది. అర్ధరాత్రికి తిరుపతికి చేరుకోనుంది. రేపు ఉదయం ప్రజల సందర్శనార్ధం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్‌లో పార్దీవదేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి గోవిందదామంలో అంతిమసంస్కారం నిర్వహించనున్నారు.
Here's AP CMO Tweet
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణంపై సీఎం వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన డాలర్ శేషాద్రి గుండెపోటుతో మృతి చెందారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2021
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని మాజీ సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని.. శేషాద్రి ప్రత్యేక రీతిలో స్వామి వారికి సేవ చేసుకున్నారని కొనియాడారు. డాలర్ శేషాద్రి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు.
డాలర్ శేషాద్రి మరణం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.శేషాద్రి సేవలు మరువలేనివన్నారు. ఆయన మరణం పట్ల సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారన్నారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారన్నారు. ఆయన మరణ వార్త (Tirumala temple OSD Dollar Seshadri dies) తానను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయాన్నే ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. శేషాద్రి మృతి టీటీడీకి తీరనిలోటన్నారు. డాలర్ శేషాద్రి నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించేవారని, ఆయన టీటీడికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. శేషాద్రి తన చివరి క్షణంలోనూ స్వామి వారి సేవకు పాటుపడుతూ కన్నుమూశారన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
డాలర్ శేషాద్రి హఠాన్మరణం హృదయాన్ని కలచివేసిందని విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనదన్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని పేర్కొన్నారు. డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు.డాలర్ శేషాద్రితో విశాఖ శ్రీ శారదా పీఠానికి సుధీర్ఘ కాలం అనుబంధం ఉందన్నారు. ఆయన సాక్షాత్తు మహావిష్ణువు హృదయంలోకి చేరాలని ఆశిస్తున్నామని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు.
50 ఏళ్లుగా డాలర్ శేషాద్రి శ్రీవారికి సేవలు అందించారని మాజీ జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. డాలర్ శేషాద్రి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. టీటీడీకి శేషాద్రి చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. మరణించే చివరి క్షణం వరకు... స్వామివారి సేవలోనే శేషాద్రి తరించారని శ్రీనివాసరాజు పేర్కొన్నారు.