DSP Paparao Dies: కరోనాతో ఏపీలో డీఎస్పీ మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విజయనగరం సిసిఎస్ డీఎస్పీ జె.పాపారావు, ఏపీలో ప్రమాదకరంగా మారుతున్న సెకండ్ వేవ్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌కు కరోనా
DSP Paparao Dies (photo-Video grab)

Vijayanagaram, April 18: ఏపీలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారుతోంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా కరోనా బారినపడి సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి ( vijayanagaram ccs station dsp paparao dies due to covid-19) చెందారు. విశాఖలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ (dsp paparao dies due to covid-19) మరణించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటకు చెందిన పాపారావు (Dsp Paparao) ఎస్ఐ స్థాయి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా సిసిఎస్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కరోనా బారిన పడి పాపారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అతడి భార్య సుమతి, ఇద్దరు కుమారులు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన బార్య విశాఖలోని శ్రద్ధ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్నారు. ఇక పెద్ద కుమారుడు కిరణ్, చిన్న కుమారు రవీంద్ర కూడా కరోనా కాటుకు గురై కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీంతో తన భర్తను చూసుకోలేని దయనీయ స్థితిలో భార్య సుమతి, తండ్రికి తలకొరివి పెట్టలేని స్థితిలో ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆస్పత్రిలోనే గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. దీంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగింది.

డీఎస్పీ పాపారావుది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం. దీంతో శివరామపురం గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. పెద్ద కుమారుడు ఢిల్లీ లోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో బీటెక్, చిన్న కుమారుడు విశాఖలో మెడిసిన్ చదువుతున్నాడు. అంత పెద్ద కుటుంబ అయ్యి ఉండి కూడా.. అనాథలా డీఎస్పీ అంత్యక్రియలు చేయాల్సి వస్తోందని బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పాపారావు మృతికి విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి, జిల్లా పోలీస్ యంత్రాంగం సంతాపం తెలిపారు.

కర్నూలు జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌లో కరోనా కలకలం చెలరేగింది. 52 మంది విద్యార్థినీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే ప్రిన్సిపాల్ శాంతి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఏపీలో పరుగులు పెడుతున్న సెకండ్ వేవ్, తాజాగా 7,224 మందికి కరోనా, చిత్తూరులోనే అత్యధికంగా గత 24 గంటల్లో 1051 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 96 కేసులు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 10న స్వల్పంగా దగ్గు రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు రెండు రోజులు ఎయిమ్స్‌లో చేరారు. డిశ్చార్జ్‌ అయ్యాక విజయవాడ క్యాంపు నివాసంలోనే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

రాష్ర్టానికి ఆరు లక్షల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చింది. ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో శనివారం ఉదయం కొవిషీల్డ్‌ ఐదులక్షల డోసులు వచ్చాయి. అలాగే హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన కొవ్యాక్సిన్‌ లక్ష డోసులు వచ్చాయి. వ్యాక్సిన్లను ప్రత్యేక వాహనాల్లో 13 జిల్లాలకు తరలించారు. కాగా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, హెల్త్‌ వర్కర్లకు రాబోయే 72 గంటల్లో వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఆదేశాలు జారీచేశారు.

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు సజీవ దహనం, దేశంలో కొత్తగా 2,61,500 మందికి కరోనా నిర్ధారణ, తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్

కరోనా కేసులు భారీగా పెరగడంతో శనివారం నుంచి కాకినాడలోని అన్ని పార్కులను మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి రాజమహేంద్రవరంలోనూ కూడా పార్కులు, కమ్యూనిటీ హాళ్లు మూసి వేయాలని నిర్ణయించారు. శనివారం జిల్లావ్యాప్తంగా 30 సినిమా హాళ్లను మూసివేశారు. విజయవాడలోని అన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేస్తున్నట్టు విజయవాడ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు. ఈ నెల 19 నుంచి 30 వరకు సాయంత్రం 6 గంటలకే దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించామన్నారు.