AP DGP Rajendranath Reddy (Photo-Video Grab)

Visakha, June 16: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్‌, వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్‌ (Visakha MP Family Kidnap Case) కావడం కలకలం రేపిర సంగతి విదితమే.ఈ కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులు వారి నుంచి రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. వారి నుంచి ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామన్నారు. ఇద్దర్నీ అరెస్ట్ చేశామని తెలిపారు.

ప్రాథమిక నిందితుడిని హేమంత్ కుమార్‌గా గుర్తించామని, అతనిపై ఒక హత్య కేసు, అనేక కిడ్నాప్ కేసులు సహా 12 కేసులు నమోదయ్యాయని, అతను జైలుకు వెళ్లి 15 రోజుల క్రితమే బయటకు వచ్చానని సీపీ తెలిపారు. ఏడుగురు కిడ్నాపర్లలో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని హేమంత్‌, రాజేష్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వెంకటేశ్వరరావు తీయకపోవడంతో సత్యనారాయణకు అనుమానం వచ్చిందని సీపీ తెలిపారు. విశాఖపట్నం పోలీసులు నగర పరిధిలో 17 పోలీసు బృందాలను సమీకరించారు, ఆపై కిడ్నాపర్లు పారిపోతుండగా పెద్దబానాబాం పోలీసులు పట్టుకున్నారని ఆయన తెలిపారు.

175 సీట్లలో అభ్యర్థులను నిలబట్టలేని ఆ వ్యక్తి మనకు ప్రత్యర్థి, టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాబుపై విరుచుకుపడిన సీఎం జగన్

ముగ్గురు నిందితులు ఎంపీ కుమారుడి ఇంట్లోకి వెళ్లి బెదిరించారు. ఎంపీ కుమారుడు శరత్‌ను ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు. మరుసటి రోజున ఎంపీ భార్య జ్యోతిని (Andhra Pradesh MP MVV Satyanarayana’s Wife) కుమారుడు శరత్‌తో పిలిపించి ఆమెను కూడా కట్టేశారు. ఆడిటర్‌ జీవీ వస్తే ఆయన్ను కూడా కట్టేసి బెదిరించారు. ఎంపీ కుమారుడి ఇంట్లో ఉన్న రూ.15లక్షలు తీసుకున్నారు. మరో రూ.60 లక్షలు ఖాతా నుంచి బదిలీ చేయించుకున్నారు. జీవీని కొట్టి బెదిరించి రూ.కోటి వరకు తెప్పించుకున్నారని డీజీపీ వివరించారు.

కిడ్నాప్‌ సమాచారం అందగానే పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. కిడ్నాపర్లు రుషికొండ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. అప్పటివరకు బాధితులను కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్‌ చేస్తూ వచ్చారన్నారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలిసి ఎంపీ సతీమణి, కుమారుడు, అడిటర్‌ జీవీతో పాటు కారులో పరారయ్యేందుకు యత్నించారు. నిందితులు హేమంత్‌, రాజేశ్‌, సాయి ముగ్గురూ కలిసి కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఛేజ్‌ చేశారు.

కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ, వైసీపీ వై నాట్ 175కి పోటీగా సరికొత్త నినాదంతో ముందుకు వచ్చిన చంద్రబాబు

పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు మరమ్మతుకు గురవ్వడంతో కిడ్నాప్ చేసిన ముగ్గుర్నీ అక్కడే వదిలేసి పరారయ్యారని, పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు సరిగా లేవని వస్తోన్న వార్తలపైనా డీజీపీ స్పందించారు. ఈ నేరఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ వివరించారు.