Road Mishap in Vizag (Photo-Video grab)

Visakhapatnam, Nov 25: విశాఖపట్నం నగర శివారు ఎండాడ వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనాన్ని గుర్తు తెలియని వాహనం (unknown vehicle hits police vehicle ) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కరణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి (Three Town Circle Inspector Karanam Eshwara Rao dies) చెందారు. ఘటన ఎలా జరింగిదనే దానిపై సమీప ప్రాంతాల్లో సీసీటీవి ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో కానిస్టేబుల్ సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని నగర కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే రేవళ్లపాలెంలోని సీఐ భార్య కుటుంబ సభ్యులను సీపీ పరామర్శించారు.

త్రీటౌన్ సీఐ కరణం ఈశ్వరరావు (Three Town Circle Inspector Karanam Eshwara Rao) నైట్ పెట్రోలింగ్‌ను ముగించుకొని ఇంటికి వెళుతుండగా.. పోలీస్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ సంతోష్‎ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీఐకు తలకు బలంగా తగలండంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సీఐ ఈశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‎కు తరలించారు. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం

విధినిర్వహణలో ఉండగా అనూహ్యంగా రోడ్డు ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయిన విశాఖ త్రీటౌన్ శాంతి భద్రతల సీఐ కరణం ఈశ్వర్ రావు మృతిపట్ల ఎంపీ విజయసాయిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘విధినిర్వహణలో విశాఖ త్రీటౌన్ శాంతి భద్రతల సీఐ కరణం ఈశ్వర్ రావు గారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అంకిత భావంతో, పేదల పక్షపాతిగా, స్నేహపూర్వకంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించే అధికారి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.