Vizag Gas Leak: విశాఖ సెంట్రల్‌ జైలుకు ఎల్జీ పాలిమర్స్‌ నిందితులు, 14 రోజుల రిమాండ్‌ విధించిన సెకండ్‌ అడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు
Gas Leakage at LG Polymers Plant (Photo Credits: ANI)

Amaravati, July 8: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన కేసులో అరెస్టు అయిన 12 మందిని విశాఖ పోలీసులు (Visakhapatnam police) బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు మందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరు పరచగా వీరికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు నిందితులను విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా స్టైరీన్‌ గ్యాస్‌ ప్రమాద ఘటనకు (LG Polymers gas leakage) సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రమాదానికి ప్రధాన కారణం అదే, విశాఖ గ్యాస్‌ లీకేజీపై ఏపీ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన హైపర్‌ కమిటీ, 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలు కొన్ని మీకోసం

నిన్న రాత్రి కేజీఎచ్‌లో నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబర్‌ 213గా కేసు నమోదు చేయగా, ఐపీసీ 304(2),278, 284 285, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ప్రాంతంలో ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో మే 7వ తేదీన ఎల్‌జీ పాలీమర్స్‌ కంపెనీలో స్టైరీన్‌ వాయువు లీకైన ఘటనలో స్థానికులు 12 మంది మృతి చెందగా.. 585 మంది అస్వస్థతకు గురయిన సంగతి విదితమే. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ సీఈఓ అరెస్ట్, ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు

ఎల్జీ పాలిపర్స్ ప్రమాదంపై సీనియర్ ఐఏఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని నియమించగా, రెండు నెలలపాటు ఆయా గ్రామాల ప్రజలు, అన్ని వర్గాలను సంప్రదించి 350 పేజీల‌ నివేదికను హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సమర్పించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని హైపవర్ కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఎల్జీ పాలిపర్స్ సీఈఓ, డైరక్టర్లు సహా విశాఖ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సస్పెన్షన్ చేసింది.