Visakhapatnam, May 8: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ (Vizag Gas Leak Tragedy) దుర్ఘటనలో మొత్తం 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో సుమారు వెయ్యి మందికిపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటన పట్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఎన్జీటీ నోటీసులు ఇచ్చింది. గ్యాస్ లీకేజీ ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య, ఐదు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు, వదంతులు నమ్మవద్దన్న విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా
ఎన్జీటీతో పాటు పర్యావరణ, అడవుల మంత్రిత్వశాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ)లు (Central Pollution Control Board (CPCB)) కూడా ఎల్జీ పాలిమర్స్ సంస్థకు (LG Polymers Plant) నోటీసులు ఇచ్చాయి. అయితే ప్రాథమికంగా నష్టపరిహారం కింద 50 కోట్లు డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఏపీ సీఎం వైయస్ (APCM YS jagan) జగన్ రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు, రెండు నుంచి మూడు రోజులు దవాఖానలో ఉండే పరిస్థితి ఉన్నవారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకు గురైనవారికి రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘట నపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకయిన వెంటనే రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ నేవీ బృందాలు, లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేది, మీడియాతో ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ ఎస్‌ఎన్ ప్రధాన్
కాగా COVID-19 లాక్డౌన్ కారణంగా ప్లాంట్ 40 రోజులకు పైగా మూసివేయబడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా దాన్ని తిరిగి తెరిచారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ లీకయి ప్రమాదం సంభవించింది. అంతకుముందు శుక్రవారం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గ్యాస్ లీక్ పరిస్థితి అదుపులో ఉందని, తటస్థీకరణ ప్రక్రియ ఇప్పటికే జరుగుతోందని పేర్కొంది. రెండవ లీకేజీకి సంబంధించిన వార్త మైనస్ టెక్నికల్ లీక్ అని MHA స్పష్టం చేసింది.
Here's what NGT said:
National Green Tribunal (NGT) directs LG Polymers, India to forthwith deposit an initial amount of Rs. 50 crore taking note of damages caused due to #VizagGasLeakage incident. https://t.co/LoHcZSSdc6
— ANI (@ANI) May 8, 2020
శుక్రవారం ఉదయం కూడా కంపెనీ ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో కర్మాగారం సమీపంలోని 5 కిలోమీటర్ల దూరంలోని ప్రజలను బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించామని అగ్నిమాపకశాఖ అధికారి సురేంద్ర ఆనంద్ చెప్పారు. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ బ్యాంకర్‌లో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. పుణె, నాగపూర్ నుంచి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. పూర్తిస్థాయిలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ కెమికల్ కర్మాగారంలో విషవాయువు లీకేజీకి కారణాలపై పూణే నుంచి వచ్చిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఎల్ జీ పాలిమర్స్ కంపెనీలో నుంచి గురువారం అర్దరాత్రి కూడా మళ్లీ గ్యాస్ లీకైన నేపథ్యంలో ఈ కంపెనీ పరిసర ప్రాంతాల ప్రజలు రెండు రోజుల వరకు ఇళ్లకు రావద్దని ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు సూచించారు.
ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బస్సుల్లో వీరిని సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సింహాచలం కొండ దిగువ పాత గోశాల దగ్గర నుంచి మార్కెట్ కూడలి వరకు ఉన్న పలు ప్రైవేటు కల్యాణ మండపాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. పూర్తిగా ప్రమాదం లేదని నిర్ధారించిన తరువాతే ప్రజలను గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.