Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Amaravati, July 14: ఏపీలో నైరుతి రుతు పవనాలు (Southwest Monsoon in AP) విస్తరించాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.నేడు రేపు కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (AP Weather Report) కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం (Visakhapatnam Meteorological Center) వెల్లడించింది.

గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే చేరుకొని, దేశమంతటా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరోవైపు కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టుల్లో నీరు పెరుగుతుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ గలగలలు మొదలయ్యాయి. అటు తుంగభద్రలోనూ నీటి ప్రవాహం పెరగడంతో జూరాలలో ప్రాజెక్టు జలకళను సంతరించుంది. దీంతో జూరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని దిగువకు విడుదల చేసింది. అటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో బ్యారేజీ జలకళను సంతరించుకుంది. విశాఖను వెంటాడుతున్న వరుస అగ్నిప్రమాదాలు, తాజాగా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం, కార్మికుడు మృతి, ప్రమాదఘటనపై హోంమంత్రి ఆరా

దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంపై ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చురుగ్గా ఉందని.. ఆంధ్రప్రదేశ్‌పై గాలి విలోమ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ఈ కారణంగా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి.

గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వానలు పడ్డాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో లంకల గ్రామాల పరిస్థితులు మారిపోయాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఎగువును కురుస్తున్న వానలకు గోదావరి కూడా వరద పెరిగింది.