Vijayawada, Apr 27: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ (YSRCP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈక్రమంలో నేడు వైసీపీ మేనిఫెస్టో (YCP Manifesto) విడుదల కాబోతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ ఐదేళ్లలో ప్రజలను ఆకట్టుకున్న అన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ 🔥
వైసీపీ మేనిఫెస్టో లో అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపు
ఈసారి మరో 2 కొత్త పథకాలు ఉండే అవకాశం pic.twitter.com/uTGZFuMnB2
— Rahul (@2024YCP) April 27, 2024
ఉద్యోగాలకు ప్రాధాన్యత
పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పనపై కూడా మేనిఫెస్టోలో ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు పథకాలకు మరిన్ని నిధులు పెంచనున్నట్టు సమాచారం. ఈసారి మరో 2 కొత్త పథకాలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.