MP Raghu Rama Krishna Raju: అనుకున్నదే జరిగింది, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ నుంచి షోకాజ్ నోటీస్, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
YSR Congress Party issues show-cause notice to its MP K Raghurama Krishnam Raju (Photo:Twitter/RaghuRaju_MP)

Amaravati, June 24: ఈ మధ్య ఏపీలో హాట్ టాఫిక్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వివాదానికి ఎవైసీపీ పార్టీ చెక్ పెట్టే దిశగా ఎట్టకేలకు అడుగులు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు (MP Raghu Rama Krishna Raju) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  ఏపీలో 10 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, తాజాగా 497 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 10,331కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

ఈ మేరకు.. ‘‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSR Congress Party) టికెట్‌పై 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి మీరు గెలుపొందారు. అంతేగాక సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీ, ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యలు ప్ర‍కటనలు.. పార్టీ సభ్యుడిగా ఉండటం పట్ల మీ అయిష్టతను తెలియజేస్తున్నాయి. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండకుండా.. వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై మీరు పూర్తి వివరణ ఇవ్వాలని ఆయన్ని ఆదేశించింది. వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు

కాగా రఘురామ కృష్ణంరాజు (MP K Raghurama Krishnam Raju) ప్రభుత్వ పథకాలైన ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేశారు. ఇక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా ఎంపీగా మీ విజయానికి వైఎస్సార్‌సీపీ లేదా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కారణం కాదని మీరు అన్నారు.

Here's ANI Tweet

బతిమిలాడితేనే పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. ‘‘ఎవ్వరి నాయకత్వం నాకు కావాలి? బొచ్చులో నాయకత్వం?’’ వంటి పదాలు ఉపయోగించి ప్రాథమిక నిబంధనలు అతిక్రమించారు. ఈ పరిణామాలన్నీ మీరు పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుపుతున్నాయి. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీరు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మీ మాటలు, చేతలను బట్టి ఇలా భావించాల్సి వస్తోంది. కాబట్టి ఈ విషయాలపై స్పందించేందుకు మీకు ఏడు రోజుల గడువు ఇస్తున్నాం. లేనిపక్షంలో పార్లమెంటరీ పార్టీ.. చట్ట ప్రకారం తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది’’ అని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరిట జారీ చేసిన షోకాజ్‌ నోటీసులో పేర్కొంది. ఇందుకు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను కూడా జోడించారు.