Amaravati, Dec 25: సొంతిల్లు లేని పేదల కోసం 'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి మండలంలో ఈ కార్యక్రమాన్ని (YSR Housing Scheme 2020) ప్రారంభిస్తూ అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. అక్కడ నిర్మించిన మోడల్ హౌస్ ను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను (Distribution of 30 lakh house sites) పంపిణీ చేస్తున్నామని.. రూ. 28 వేల కోట్లతో తొలి దశలో 16.5 లక్షల ఇళ్లను నిర్మించనున్నామని ఏపీ సీఎం (AP CM YS Jagan Mohan Reddy) తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల 1.24 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని తెలిపారు. తాము కడుతున్నది ఇళ్లను కాదని... ఏకంగా గ్రామాలనే నిర్మిస్తున్నామని జగన్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,500 వైయస్సార్ జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు.
మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేసేందుకు అనుక్షణం కృషి చేస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ప్లాటు విలువ రూ. 4 లక్షలు ఉంటుందని చెప్పారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా ఇంటిని అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ఎల్ఈడీ లైట్లతో పాటు ఇంటి పైన ఒక సింటెక్స్ ట్యాంక్ ఉంటుందని చెప్పారు.
AP CM Launch YSR Housing Scheme 2020
యు.కొత్తపల్లి మండలం, కొమరగిరి గ్రామంలో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు.. ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ, వైయస్ఆర్ జగనన్న కాలనీ శంకుస్థాపన పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్. #HousingForPoor🏠#YSRJaganannaIllaPattalu🏠 pic.twitter.com/IWJGrvW2mD
— YSR Congress Party (@YSRCParty) December 25, 2020
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా వైయస్ఆర్ జగనన్న కాలనీల్లోని నమూనా ఇల్లు. #HousingForPoor🏠#YSRJaganannaIllaPattalu🏠 pic.twitter.com/kNPlikiQSW
— YSR Congress Party (@YSRCParty) December 25, 2020
ఇల్లులేని నిరుపేద ఆడపడుచులకు "ఇళ్ల పట్టా"భిషేకం. థ్యాంక్యూ సీఎం సర్ అంటున్న అక్కచెల్లెమ్మలు#HousingForPoor🏠#YSRJaganannaIllaPattalu🏠 pic.twitter.com/z5YkHGA0Xu
— YSR Congress Party (@YSRCParty) December 25, 2020
సొంతిల్లు లేని పేదల కష్టాలను ( houses for all poor) పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి (YSR Housing Scheme) శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. దీనివల్ల దాదాపు కోటి 24 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని వ్యాఖ్యానించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని, మన ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతుందన్నారు. ఇవాళ ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నామని చెప్పారు.
అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామంటే సామాజిక అసమతుల్యం వస్తుందంటూ టీడీపీ కోర్టుకెళ్లింది. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నిన్న కూడా హైకోర్టులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై పిల్ దాఖలు చేశారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుంది. త్వరలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
ఒక కులం ఉండకూడదని ఎవరైనా అంటారా? అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? అందరికీ చోటు ఉంటేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లలో జగనన్న స్కీమ్ కావాలా? చంద్రబాబు స్కీమ్ కావాలా? అని సర్వే చేశాం. 1.43 లక్షల మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ అడిగారు. ఆ ఒక్కరికి చంద్రబాబు స్కీమ్‌లోనే ఇల్లు ఇస్తాం. మిగిలిన వారందరికీ జగనన్న స్కీమ్‌లో ఒక్క రూపాయికే ఇల్లు అందిస్తాం" అని సీఎం జగన్ అన్నారు