Amaravati, Feb 7: జగనన్న చేదోడు కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేయనున్నారు. రెండో విడత (release 2nd phase funds ) 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ. 285 కోట్లను విడుదల చేయనున్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేయనున్నారు.
ఏటా షాపులున్న ప్రతిఒక్కరికి జగనన్న చేదోడు (YSR Jagananna Chedodu Scheme) కింద రూ.10వేల ఆర్ధిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దఫా షాపులున్న 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులున్న 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. మంగళవారం వేయబోయే రెండో విడుత నగదుతో కలిపి.. ఇప్పటి వరకూ జగనన్న చేదోడు (YSR Jagananna Chedodu Scheme) కింద రూ.583 కోట్లు విడుదల చేసినట్లు అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS jagan) సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచే విప్లవాత్మక చర్యల ప్రగతిని సీఎం సమీక్షించారు. డ్రై స్టోరేజీ-డ్రైయింగ్ ఫ్లాట్‌ఫామ్స్, గోడౌన్లు, హార్టికల్చర్‌లో మౌలిక సదుపాయాలు, ప్రైమరీ ప్రాససింగ్‌సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్‌మెంట్, ప్రొక్యూర్ మెంట్ సెంటర్లు, ఈ-మార్కెటింగ్, మెగా కస్టం హైరింగ్ హబ్స్, ఆర్బీకేల స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, వరి పండిస్తున్న జిల్లాల్లో కంబైన్డ్ హార్వెస్టర్లు, ఏంఎసీలు–బీఎంసీలు, ఆక్వా ఇన్‌ఫ్రా, ఫిషింగ్ హార్బర్లు–ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాససింగ్‌సెంటర్లు, పశుసంవర్థక శాఖలో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఇప్పటివరకూ తీసుకుంటున్న చర్యలను సీఎం సమీక్షించారు.