Minister Venugopalakrishna, Kapu Corporation Chairman Jakkampudi (Photo-Twitter)

Amaravati, Nov 8: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా గతేడాది పరిపాలనలోకి వచ్చిన తరువాత పేద మహిళల కోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పధకాన్ని (YSR Kapu Nestham Scheme) తీసుకువచ్చిన సంగతి విదితేమే. ఇప్పటికే వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో (YSR Kapu Nestham Scheme 2020) భాగంగా తొలి ధఫా మొత్తం విడుదల చేయగా రెండో ధపా మొత్తాన్ని నిన్న విడుదల చేశారు.

కొత్తగా అర్హులైన 95,245 మంది మహిళా లబ్ధిదారులకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లోకి నగదును రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ శనివారం విజయవాడలో ప్రారంభించారు.

కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా కొత్తగా గుర్తించిన మహిళా లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు. మొదటి విడతలో ఈ పథకం(YSR Kapu Nestham) కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి అనుకోని కారణాల వల్ల దరఖాస్తు చేయని వారికి, అందుబాటులో లేని వారికి, జాబితాలో పేర్లు లేని వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కొత్తగా 95,245 మంది మహిళా లబ్ధిదారులను గుర్తించి రూ.142.87 కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు.

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం, నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభం, కొత్త ఇసుక పాలసీ విధానం అమల్లోకి..

ఇప్పటికే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు 2,35,360 మంది కాపు మహిళా లబ్ధిదారులకు రూ.353 కోట్లను విడుదల చేయడం తెలిసిందే. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా 2019–20 సంవత్సరానికి గాను మొత్తంగా 3,30,605 మంది లబ్ధిదారులకు రూ.495.87 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం కింద అందించారు.

ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతికి తావులేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ ఆదర్శ పాలకుడిగా నిరూపించుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ రిజర్వేషన్‌ల నుంచి 5% కాపులకు ఇస్తున్నానని చెప్పి వారిని ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అప్పుడు అధికారంలో ఉండగా మోసం చేశారని విమర్శించారు. కాపులు వారి సమస్యలపై ఉద్యమిస్తే.. కేసులు పెట్టి వేలాది మందిని చంద్రబాబు జైళ్లలో పెట్టించారని, ఆ కేసులన్నీ ముఖ్యమంత్రి జగన్‌ ఎత్తివేశారని తెలిపారు.16 నెలల కాలంలో కాపులకు రూ.5,542 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించిన ఘనత ఏపీ సీఎం జగన్‌దేనన్నారు. ఇక కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ప్రజా మేనిఫెస్టో అమలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు.