CM Jagan in YSR Yantra Seva scheme (Photo-APCMO)

Amaravati, June 2: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం సీఎం జగన్‌ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు.

వైయస్సార్‌ యంత్ర సేవా పథకం, రూ.361.29 కోట్లు విలువైన 2,562 ట్రాక్టర్లను రైతులకు అందించిన సీఎం జగన్

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘రైతన్నకు అండగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ఉంది. ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించాం. ఇ‍ప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. రైతు గ్రూపులకు కొత్తగా రూ. 361.29కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను అందించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15లక్షలు కేటాయించాం.

వ్య‌వ‌సాయరంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులకు శ్రీకారం చుట్టాం, వైయ‌స్సార్ యంత్ర సేవా ప‌థ‌కం కార్యక్రమంలో సీఎం జగన్

ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, ఏమి అవసరమో వారినే అడిగి అందజేస్తాం. అందులో భాగంగానే వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం’ అని అన్నారు.