CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

Vjy, Oct 9: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో (YSRCP Meeting in Vijayawada) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తొలి సేవకుడిగా బాధ్యతగా వ్యవరించాను. అధికారం బాధ్యత ఇచ్చింది. 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించాం.

మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్‌సీపీ (YSRCP) తప్ప ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదు అంటూ స్పష్టం చేశారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం... పేదవాడి పార్టీ వైఎస్సార్‌సీపీ. పేదవాడు ఒక వైపు.. పెత్తందారు మరోవైపు. పేదవాళ్లు మొత్తం ఏకం కావాలి. అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమన్నారు.

చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం, నేడు సుప్రీంకోర్టులో విచారణకు ఎస్‌ఎల్‌పీ

చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే ఈడీ, సీబీఐ నోటీసులు ఇచ్చాయి. చంద్రబాబుపై కక్షపూరితంగా చేసి ఉంటే కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీలో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. వారు స్పష్టమైన ఆధారాలు ఉన్నా చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దట. పచ్చ గజ దొంగలు చంద్రబాబు అరెస్ట్‌ను అన్యాయం అంటున్నాయి. బాబును సమర్థించడం అంటే పేదలను వ్యతిరేకించినట్టే. చంద్రబాబును సమర్థించడం అంటే పెత్తందారి వ్యవస్థను సమర్థించడమే.

రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా.. ఫలితం సున్నానే అంటూ CM Jagan Mohan Reddy ఎద్దేవా చేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానే. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్లకు లేదు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడమే వారి లక్ష్యం. రాజకీయం అంటే చనిపోయాక కూడా బతికుండటం. మంచి జరిగితేనే అండగా ఉండాలని కోరుతున్నా. మన ధైర్యమంతా చేసిన మంచే. అందుకే వై నాట్‌ 175 అని ప్రజల్లోకి వెళ్తున్నాం.

కేంద్రహోంమంత్రితో వైయస్ జగన్ కీలక భేటీ, ఇరువురి సమావేశంలో దానిపైనే కీలక చర్చ జరిగిందంటూ వార్తలు, సమావేశంలో చర్చించిన అంశాలపై రకరకాల ఊహాగానాలు

ఫిబ్రవరిలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళదాం. మార్చిలో ఎన్నికలకు సన్నద్ధమవుదాం. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా గ్రామస్థాయి నుంచే మమేకమవ్వాలి. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా అడుగులు వేయాలి. ఎన్నికల సంగ్రామంలో పొత్తు ప్రజలతోనే. మీ బిడ్డ పొత్తులపై ఆధారపడడు. దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నాను. సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన ప్రభుత్వం మనది. రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమాన్ని అందించాం. ఎక్కడా లంచాలకు తావు లేదు. వివక్షకు చోటు లేదు. మనం అమలు చేసిన ప్రతీ కార్యక్రమం ఒక విప్లవం. ధైర్యంగా ప్రతీ ఇంటికి వెళ్లి అడగడం ఒక చరిత్ర. ఎక్కడా లంచాలు లేవు అంటూ జగన్ తెలిపారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా నా కుటుంబ సభ్యులే. నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చాం. గ్రామస్థాయిలోనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు ఉండేలా వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99 శాతం హామీలను నెరవేర్చాం. వైఎస్‌ జగన్‌ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నాం. వ్యవస్థలోగానీ, పాలనలోగానీ ఇన్ని మార్పులు తెచ్చిన పార్టీ లేదన్నారు.

ఎ‍న్నికల సంగ్రామంలో పొత్తు ప్రజలతోనే. మీ బిడ్డ పొత్తులపై ఆధారపడడు. దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నాను. సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన ప్రభుత్వం మనది. రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమాన్ని అందించాం. ఎక్కడా లంచాలకు తావు లేదు. వివక్షకు చోటు లేదు. మనం అమలు చేసిన ప్రతీ కార్యక్రమం ఒక విప్లవం. ధైర్యంగా ప్రతీ ఇంటికి వెళ్లి అడగడం ఒక చరిత్ర. ఎన్నికల తర్వాత కూడా ఎప్పుడూ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలోనే ఉన్నారు’

వై ఏపీ నీడ్స్‌ జగన్‌

ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్‌ రావాలి. నవంబర్‌ 1 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని చేపడతాం. ఈ కార్యక్రమం డిసెంబర్‌ 10 వరకు కొనసాగుతుంది. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలి. మండల స్థాయి నేతలు సచివాలయాలను సందర్శించాలి. రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలి. 2019లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని చెప్పాలి. రాష్ట్రానికి, ప్రతి ఇంటికి జరిగిన మంచిని తెలపాలి. టీడీపీ, దత్తపుత్రుడి మోసాలను ప్రజలకు వివరించాలి.

బస్సు యాత్ర..

అక్టోబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31 వరకు బస్సుయాత్ర. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ఉంటుంది. ఎమ్మెల్యేలు, సీనియర్ల ఆధ్వర్యంలో బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలుంటారు. ప్రతీరోజు మూడు మీటింగ్‌లు జరుగుతాయి. ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, సాధికారత గురించి తెలియజేయాలి. ఇది బస్సు యాత్ర మాత్రమే కాదు. సామాజిక న్యాయ యాత్ర. పేదవారికి జరిగిన మంచిని వివరించే యాత్ర. బస్సు యాత్రలో పార్టీ శ్రేణులు పాల్గొనాలి. రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలి. 2019లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న విషయాన్ని చెప్పాలి. రాష్ట్రానికి, ప్రతి ఇంటికి జరిగిన మంచిని తెలపాలి. టీడీపీ, దత్తపుత్రుడి మోసాలను ప్రజలకు వివరించాలి.

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం..

డిసెంబర్‌ 11 నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబురం జరుగుతుంది. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తిస్తాం. భారత్‌లో వై నాట్‌ ఏపీ పరిస్థితి రావాలి. ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబురం ఇది. విజేతలు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారు.

పెన్షన్‌ పెంపు..

జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్‌ పెంపు కార్యక్రమం ఉంటుంది. ఇచ్చిన మాట ప్రకారం రూ.3000 పెన్షన్‌ పెంపు అందిస్తాం. అవ్వాతాతలు, వితంతువులకు రూ.3వేల పెన్షన్‌. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేల పెన్షన్‌ అందిస్తాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాక ముందు 39 లక్షల మందికి పెన్షన్లు. మేము అధికారంలోకి వచ్చాక 66లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం. నెలకు రూ.2వేల కోట్ల భారం చిరునవ్వుతో భరిస్తున్నాం.

జనవరి 10 నుంచి జనవరి 20 వరకు వైఎస్సార్‌ చేయూత అందిస్తాం. రూ. 19వేల కోట్లు చేయూత ద్వారా అందిస్తున్నాం. జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్సార్‌ ఆసరా. ఇప్పటికే మూడు దఫాలుగా వైఎస్సార్‌ ఆసరా ఇచ్చాం. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.26వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికే మూడు దఫాలుగా ఆసరా ఇచ్చాం. పొదుపు సంఘాలకు మొత్తంగా రూ.31వేల కోట్లు అందిస్తున్నాం.

పేదవాడి గురించి ఆలోచించే ప్రభుత్వం మనది..

సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమ న్యాయం చేశాం. రూ.2లక్షల 35వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా అందించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. 22లక్షల ఇళ్లు అక్కచెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయి. ఇందులో 80 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. నామినేటెడ్‌ పదువుల్లో 50 శాతానికి పైగా వీరికే ఇచ్చాం. ఈ నాలుగేళ్లలో 2.7లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అక్కచెల్లెమ్మల సాధికారతకు కృషి చేశాం. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వ‍చ్చేలా చర్యలు తీసుకున్నాం. పేదవాడి గురించి ఆలోచించే ప్రభుత్వం మనది. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం పాటించాం. అవినీతికి తావు లేకుండా పాలన అందించాం.

జగనన్న సురక్ష..

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలి. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదు. వ్యాధి సోకిన వారికి తగిన చికిత్స ఇచ్చేందుకు సురక్ష పథకం తెచ్చాం. 15వేల హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. సురక్ష ద్వారా కోటి 65 లక్షల ఇళ్లను కవర్‌ చేస్తున్నాం. వ్యాధి బారినపడిన వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. వ్యాధి నయం అయ్యే వరకు పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తాం. ఆరోగ్య సురక్ష ద్వారా 1.65 కోట్ల ఇళ్లను కవర్‌ చేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష నిరంతర ప్రక్రియ. విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అనుసంధానం.