
Amaravati, Feb 9: దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ముద్దుల తనయ వైయస్ షర్మిల కొత్త పార్టీపై (ys sharmila party) నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. షర్మిల పార్టీ (YS sharmila New Party) పెట్టడం తన అన్న ఏపీ సీఎం వైయస్ జగన్ డైరెక్షన్‌లో జరిగిందా.. లేదా అనేది త్వరలో తేలుతుందన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమని, సమైక్య ఏపీకి అనుకూలమని... ఈ విషయం తెలంగాణలో అందరికీ తెలుసన్నారు.
కాగా వైఎస్ పేరు లేకుండా వైయస్ షర్మిల లేదని ఆయన (YSRCP MP Raghu Rama Krishna Raju) తెలిపారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఓట్లు రావడం కష్టమని, తమిళనాడు లేదా కర్నాటకలో పార్టీ పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయని ఎంపీ సూచించారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు అనేది వైఎస్ జగన్‌కు సంబంధం లేకుండా షర్మిల తీసుకున్న నిర్ణయమని, అన్నకు ఇబ్బంది లేకుండా షర్మిల సొంతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ (YSRCP) కోసం చాలా కష్టపడిందని రఘురామకృష్ణ రాజు అన్నారు.
అన్నాచెల్లెళ్ల మధ్య ఇప్పటికీ అద్భుతమైన అనుబంధం ఉంది. దీనిలో మరో అనుమానం అక్కర్లేదు. నిజంగా ఇద్దరి మధ్యా వైరం ఉంటే, ఏపీలో పెట్టకుండా.. తెలంగాణలో పార్టీ ఎందుకు పెడతారు? బ్రదర్ అనిల్ విల్లు అయితే.. షర్మిల బాణం అవుతుంది... ఇద్దరూ ఇక్కడ పోరాడతారు’’ అని నర్సాపురం ఎంపీ రఘురామరాజు అన్నారు.