Hyderabad, Mar 18: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పదోతరగతి పరీక్షలు (SSC Exams) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఏపీలో (AP) 7.25 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణలో (Telangana) 5.08 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే తెలంగాణ విద్యార్థులకు ఐదు నిమిషాలు అదనంగా గ్రేస్ టైమ్ ఇచ్చారు. అంటే విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు పేపర్లు, ఇతరత్రా పత్రాలను వెంట తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే డిబార్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
నేటి నుంచి ఏపీ, తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు.. ఏపీలో హాజరుకానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు.. తెలంగాణలో హాజరుకానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు#AndhraPradesh #Telangana #sscexam #SSC #education #Students
— NTV Breaking News (@NTVJustIn) March 18, 2024
ఉచిత బస్సు ప్రయాణం
ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యేవారికి తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశాన్నిచ్చింది. ఈ సౌకర్యాన్ని సెలవు రోజుల్లోనూ వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ తో ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.