 
                                                                 Hyderabad, Sep 27: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,967 పాజిటివ్ కరోనా కేసులు (Coronavirus in Telangana) నమోదుకాగా కోవిడ్ బారినపడిన వారిలో 2,058 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,85,833 మంది కరోనా బారినపడగా 1,54,499 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 30,234 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
24,607 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా 1,100 మంది మృతి (Telangana coronavirus Deaths) చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.939 శాతంగా ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 50,108 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,50,869 టెస్టులు పూర్తిచేసినట్లు వివరించింది. కొత్తగా జీహెచ్‌ఎంసీలో 297, కరీంనగర్ 152, రంగారెడ్డి 147 కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో గత 24 గంటల్లో 88,600 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,992,533కు (Coronavirus Outbreak in India) చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,124 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 94,503కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. దేశంలో యాక్టవ్ కేసుల సంఖ్య 9,56,402గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 49,41,628కు చేరుకుంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 38 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16,28 శాతం ఉన్నాయి
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
