Credits: Facebook

Hyderabad, Dec 23: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) రాజకీయాలు (Politics) రసకందాయంలో పడ్డాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడి (Chandrababu Naidu) ఇటీవలి ఖమ్మం (Khammam) యాత్ర తెలంగాణ రాజకీయక్షేత్రంలో నిప్పును రాజేసింది. చంద్రబాబు, టీడీపీపై (TDP) ఇప్పటికే సెటైర్లు వేసిన పలువురు బీఆర్ఎస్ నేతల జాబితాలోకి తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరారు. చంద్రబాబుకి నిజంగానే తెలుగుదేశంపై ప్రేమే ఉంటే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను (Jr NTR) ఏపీకి ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు.

నవరస నటనాసార్వభౌమా నువ్వు ఇక రావా.. నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

హన్మకొండలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఖమ్మం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వివిధ పార్టీల్లో చేరిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ఎర్రబెల్లి వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్‌దని అన్నారు.

చంద్రబాబు ఖమ్మం టూర్, సెటైర్లు పేల్చుతున్న తెలంగాణ టీఆర్ఎస్ నేతలు, ఏపీలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అన్న హరీష్ రావు, టీడీపీ ఇప్పటీకే భూ స్థాపితమైందన్న కవిత

చంద్రబాబు, ఆయన కుమారుడు ఏపీకి సీఎం కావాలని అనుకుంటున్నారని అన్నారు. ప్రజలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా దిగిపోయే నాటికి హైటెక్ సిటీ వద్ద మంచినీళ్లకు కూడా దిక్కులేదని అన్నారు.