Hyd, Nov 28: వసతిగృహాల్లో తరచూ ఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలి కలెక్టర్‌లను ఆదేశించారు. ఆదేశం. విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలన్నారు.
బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశించారు. అనంతరం నివేదికలను సమర్పించాలన్నారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకుంటుండంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాశీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవు అన్నారు రేవంత్ రెడ్డి. లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని.... వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయని ...బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని సీఎం తెలిపారు.