CM KCR Meets Colonel Santosh Babu Family (Photo-Twitter)

Hyderabad, July 22: ఇటీవల భారత- చైనా సరిహద్దుల్లో (India-China standoff) మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి (Colonel B Santosh Babu's wife Santoshi) తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ (Deputy Collector) ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ (TS CM KCR)బుధవారం ప్రగతి భవన్ లో కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి అందించారు. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి

సంతోషికి హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆమెకు సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సూచించారు.

సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపిక, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Here's TS CMO Tweet

ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని కల్నల్ ఫ్యామిలీకి తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. నేడు ఆ స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు అప్పగించింది. షేక్‌పేట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని ఎంచుకోవాలని అమర సైనికుడి కుటుంబానికి సర్కారు సూచించింది. కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లో స్థలాన్ని ఎంచుకుంది. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత స్థలానికి సంబంధించిన పత్రాలను సంతోష్‌ భార్యకు కలెక్టర్‌ అందజేశారు. కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీని పరామర్శించిన సీఎం కేసీఆర్, సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపిన తెలంగాణ సీఎం

కాగా కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. సూర్యాపేట వెళ్లి కల్నల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్.. రూ. 5 కోట్ల చెక్కును అందజేశారు. సంతోష్ బాబు సతీమణికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇచ్చారు. వారిని ప్రగతి భవన్‌కు కూడా ఆహ్వానించారు. జూన్ 15న జరిగిన గల్వాన్ ఘర్షణల్లో సంతోష్ బాబుతోపాటు 21 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో చైనా సైన్యానికి కూడా భారీగా ప్రాణనష్టం వాటిల్లింది.