CM KCR Meets Colonel Santosh Babu Family (Photo-Twitter)

Hyderabad, June 22: భారత్-చైనా సరిహద్దుల్లో (India-Chine Tensions) జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు (Colonel Santosh Babu) కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం సుర్యాపేటలో (CM KCR Meets Colonel Santosh Babu Family) పరామర్శించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు.  అమరవీరునికి అశ్రు నివాళి, సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తి, జనసంద్రమైన సూర్యాపేట, వీరుడా నీకు జోహర్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు

అనంతరం సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి (Telangana CM KCR) కొనియాడారు.

సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు. సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

Here's CM KCR Meets Colonel Santosh Babu Family Video

సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. అలాగే సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి

ఈ సందర్భంగా సంతోష్ బాబు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటానని సంతోషి ఉద్వేగానికి లోనయ్యారు. నచ్చిన శాఖలో ఉద్యోగంలో చేరామని చెప్పారన్నారు. కేసీఆర్ తనను ఇంటికి కూడా ఆహ్వానించారని సంతోషి తెలిపారు. సూర్యాపేటలోని కోర్టు ఏరియాలో ఉన్న చౌరస్తాలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దానికి సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామని కేసీఆర్ అన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె. సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంఎల్ఎలు గ్యాదరి కిషోర్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ దీపికా యుగంధర్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Here's Abhishek Singhvi Tweet

క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబానికి 5 కోట్ల చెక్‌తో పాటు కల్నల్ భార్యకు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఆఫ‌ర్ లెట‌ర్‌ను సీఎం కేసీఆర్ అంద‌జేశారు. దీని ప‌ట్ల కాంగ్రెస్ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు అభిషేక్ సింఘ్వి స్పందించారు. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి తెలంగాణ స‌ర్కార్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ నియామ‌క ప‌త్రాన్ని అంద‌జేసింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఇలాంటి విధానాన్ని అనుస‌రించాల‌ని ఎంపీ అభిషేక్ సింఘ్వి అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా స్పందించిన ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.