Hyderabad, April 22: తెలంగాణలో కోవిడ్-19 కేసులు వెయ్యికి చేరువయ్యాయి, అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. నిన్న ఒక్కరోజే 56 కేసులు నమోదైతే, బుధవారం సాయంత్రం నాటికి 15 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 కేసులు, సూర్యాపేట నుంచి 03 మరియు గద్వాల్ నుంచి 2 కేసులు చొప్పున నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 943కు చేరుకుంది. డేంజర్ జోన్‌లో సూర్యాపేట, ఒకరి నుంచి ఒకరికి 80 మందికి సోకిన కరోనావైరస్
తెలంగాణలో బుధవారం మరొక కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి సంఖ్య 24కు చేరింది. ఇక ఈ వ్యాధి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 194గా ఉంది. దీని ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Top Officials Visit Hotspots:
CS Somesh Kumar and DGP Mahender Reddy visit #COVIDー19 hotspot Suryapet. #TelanganaFightsCorona pic.twitter.com/40Aoj6v7p8
— DDYadagiri (Telangana) (@DDYadagiri) April 22, 2020
పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతూ పోతుండటంతో ప్రభుత్వం లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తుంది. లాక్డౌన్ అమలవుతున్న విధానం, వైరస్ నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు నేరుగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులనే జిల్లాల్లో పర్యటించాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో సీఎస్, డీజీపీ లాంటి వారు జిల్లాలో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో హోం క్వారైంటైన్ గడువును 14 రోజుల నుంచి 28 రోజులకు ప్రభుత్వం పెంచింది.