COVID Outbreak - Representational Image (Photo-PTI)

Hyderabad, July 14: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,18,778 కరోనా పరీక్షలు నిర్వహించగా, 767 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (Telangana logs 767 COVID-19 cases) అయింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులను గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో 65, పెద్దపల్లి జిల్లాలో 59, నల్గొండ జిల్లాలో 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

అత్యల్పంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో 848 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,738 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో నేటివరకు 6,33,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,19,344 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 10,064 మందికి చికిత్స జరుగుతోంది.

రాష్ట్రంలో మూడో వేవ్‌పై (Coronavirus Third wave Alert) అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖను రాష్ట్ర మంత్రిమండలి ఆదేశించింది. కరోనా కట్టడికి సంబంధించిన కార్యాచరణ విషయంలో ఇప్పటికే అన్ని రకాల అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంతోపాటు జ్వరం సర్వే సహా పలు ముందస్తు చర్యలన్నీ తీసుకోవాలని సూచించింది. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విస్తృతమైన చర్చ జరిగింది.

మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 17, 18 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించిన కేరళ, దేశంలో తాజాగా 38,792 కోవిడ్ కేసులు, 3,09,46,074కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

మూడో వేవ్‌ ఉంటుందనే వైద్య నిపుణుల అంచనాల నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలను మరింత పటిష్ఠం చేయాలని మంత్రిమండలి అధికారులకు సూచించింది. సీఎం ఆదేశాల మేరకు మూడు రోజులపాటు ఏడు జిల్లాల్లో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఇతర అధికారులు ఆయా జిల్లాల్లో నెలకొన్న కొవిడ్‌ పరిస్థితులు, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనల గురించి క్యాబినెట్‌కు నివేదించారు.

అనంతరం అన్ని జిల్లాల్లో మందులు, ఆక్సిజన్‌ లభ్యత, ఇతర మౌలిక వసతులపై క్యాబినెట్‌ పూర్తి స్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్‌, పడకల లభ్యత, ఔషధాల లభ్యత సహా మూడోవేవ్‌కు సంబంధించిన సన్నద్ధత గురించి వైద్యారోగ్య శాఖ అధికారులు క్యాబినెట్‌కు సమాచారం అందించారు.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 1,18,46,518 ఇండ్లల్లో సర్వే పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న వారిని ముందుగా గుర్తించడం, సకాలంలో వైద్యమందించి ప్రాణాలు కాపాడటం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జ్వర సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఆదేశించారు. దీంతో మే 6న అధికారికంగా ఇంటింటా జ్వర సర్వే ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటి వరకు మొత్తం 5,05,830 మెడికల్‌ కిట్లను అవసరమైన వారికి అందించడం జరిగింది.

దేశంలో తొలి కరోనా పేషెంట్‌కి మళ్లీ కరోనా, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నప్పటికీ ఆమెకు పాజిటివ్, మళ్ళీ క్వారంటైన్‌లోకి వెళ్లిన కేరళ యువతి, ప్రసుత్తం నిలకడగా విద్యార్ధిని ఆరోగ్యం

మొత్తం మూడు రౌండ్లలో అధికారులు జ్వర సర్వే పూర్తిచేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మరోమారు జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడిలో జ్వరసర్వే ఎంతో ఉపయోగపడింది. దీని కోసం ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, మెడికల్‌ ఆఫీసర్లు శ్రమించారు. కరోనా లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం సాధ్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా జర్వసర్వే వివరాలను మంగళవారం క్యాబినెట్‌కు సమర్పించినట్లు వైద్యాధికారులు తెలిపారు.