TS Coronavirus Update: తెలంగాణలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు, తాజాగా 1,949 మందికి కోవిడ్, 10 మంది మృతితో 1,163కు చేరిన మరణాల సంఖ్య
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Hyderabad, Oct 5: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో శనివారం 51,623 టెస్టులు నిర్వహించగా, 1,949 కేసులు (TS Coronavirus Update) నమోదైనట్లు శ్రీనివాసరావు బులెటిన్‌లో తెలిపారు. ఇప్పటివరకు 32,05,249 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 1,99,276 మందికి కరోనా (novel coronavirus) సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆదివారం బులెటిన్‌లో వెల్లడించారు.

ఇక ఇప్పటివరకు కరోనా (Covid 19) నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,70,212గా ఉంది. కరోనాతో తాజాగా 10 మంది మరణించగా మృతుల సంఖ్య 1,163 కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 85.41 శాతం ఉండగా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 27,901 ఉండగా, అందులో 22,816 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పది లక్షల జనాభాలో 86,116 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఒక్కరోజులో 2,366 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

గుడ్ న్యూస్, రూ.50కే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌‌ను అందిస్తామని తెలిపిన ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, దేశంలో తాజాగా 75,829 మందికి కరోనా, కోవిడ్ మరణాలపై బయటకొచ్చిన ఆసక్తికర విషయాలు

ఇక తాజా కరోనా పరీక్షల్లో 22,714 (44%) మంది ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు కాగా, 6,194 (12%) మంది సెకండరీ కాంటాక్టు వ్యక్తులున్నారు. మిగిలినవారు డైరెక్ట్‌ కాంటాక్టు వ్యక్తులు.. రాష్ట్రంలో 231 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు నిర్వహిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 291, రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్‌ జిల్లాలో 150, నల్లగొండ జిల్లాలో 124, కరీంనగర్‌ జిల్లాలో 114 ఉన్నాయి.