Hyderabad, January 7: తెలంగాణలో నమోదయ్యే కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తుంది. చలికాలంలో సాధారణంగా వచ్చే జలుబు ఇతర అనారోగ్యాలతో పాటు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
నిన్న రాత్రి 8 గంటల వరకు 41,246 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 379 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 453 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 71,45,613 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,88,410కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 71 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 37 రంగారెడ్డి నుంచి 32 కేసులు వచ్చాయి, ఇక మిగతా అన్ని జిల్లాల నుంచి 20 లోపే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.