CM KCR atTRS Plenary Meeting (Photo-Video Grab)

Hyd, Jan 17: రేపు ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ సమావేశం (BRS Public Meeting in Khammam) కోసం ఈ రోజు హైద‌రాబాద్‌కు కేర‌ళ‌, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రానున్నారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌మాన్ (Bhagwant Mann) ఖ‌మ్మంలో జ‌న‌వ‌రి 18న జ‌ర‌గ‌నున్న బీఆర్‌ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు.

వీరితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) కూడా నేడు హైద‌రాబాద్ చేరుకోనున్నారు. వీళ్లంతా సీఎం కేసీఆర్‌తో క‌లిసి రేపు ఉద‌యం ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రికి వెళ్తారు. స్వామివారిని ద‌ర్శించుకున్న త‌ర్వాత అంద‌రూ ఖ‌మ్మం స‌భ‌కు బ‌య‌లుదేర‌తారు. ఖ‌మ్మంలో తొలిసారి నిర్వ‌హిస్తున్న బీఆర్ఎస్ స‌భ‌కు (BRS First Public Meeting) అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. క‌నివినీ ఎరుగ‌ని రీతిలో స‌భ‌ను నిర్వ‌హించనున్నారు.

ఆ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చితే కేసీఆర్ 100 సీట్లు గెలుస్తాడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు

మంత్రి హ‌రీశ్ రావు, ర‌వాణా శాఖ‌మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ ఇప్ప‌టికే బ‌హిరంగ స‌భా స్థ‌లిలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. బీఆర్ఎస్‌ ముఖ్య‌నేత‌లంతా ఈరోజు హైద‌రాబాద్ చేరుకోనున్నారు. దాంతో, 400 ఎక‌రాల్లో వాహ‌నాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు స‌భ‌లో వెయ్యు మంది వాలంటీర్లను నియామించారు.

టీఆర్‌ఎస్ తన పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుకుని జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాల నేతలు కూడా ఈ సమావేశానికి రావడం మరాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

పండగ తర్వాత హైదరాబాద్ వస్తున్నారా, అయితే ఈ 17 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తుపెట్టుకోవడం మరచిపోకండి, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల లిస్టును విడుదల చేసిన తెలంగాణ పోలీసులు

ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ పాలనలో లౌకికవాదం, సోషలిజం,స్వేచ్ఛతో సహా రాజ్యాంగ స్ఫూర్తి పలచబడిపోతుందని ఆరోపించిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్.. బిఆర్‌ఎస్ దేశానికి "ప్రత్యామ్నాయ రాజకీయాలను" తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖమ్మం బహిరంగ సభ ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ఒక అడుగుగా పరిగణించబడుతుందా అని అడిగిన ప్రశ్నకు కుమార్, ఇది తరచుగా పునరావృతమయ్యే "ఫ్రంట్" ఏర్పాటు మాత్రమే కాదని, దేశ ప్రజలకు "ప్రత్యామ్నాయ రాజకీయాలు BRS చూపాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఇతర రాష్ట్రాల సీఎంలను యాదాద్రి ఆలయానికి తీసుకెళ్లిన కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు.బీఆర్‌ఎస్ ఖమ్మం సమావేశానికి ముందు హిందూ దేవాలయాన్ని పెట్టుబడి అవకాశంగా చూపించేందుకు కేసీఆర్ ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకుంటున్నారా? అంటూ ట్వీట్ చేశాడు.