Hyderabad Floods: భారీ వరదలకు భాగ్యనగరం కుదేల్, రూ.15 కోట్ల సాయం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం, రూ. 10 కోట్లు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం, మరోసారి నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
Delhi CM Arvind Kejriwal (Photo Credits: ANI)

HYD, Oct 20: భారీ వర్షాలతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం (Hyderabad floods) అతలాకుతలమైంది. భాగ్యనగరంలో భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం 15 కోట్ల రూపాయల (Kejriwal offers ₹15 crore to Telangana) సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi CM Arvind Kejriwal) ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.

వరదలతో హైదరాబాద్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు హైదరాబాద్‌ సోదర సోదరీమణుల పక్షాన నిలబడి.. వారికి సాయం చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణకు 15 కోట్ల రూపాయల సాయం చేయనుంది’ అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

Here's Delhi CM Tweet

భారీ వర్షాలు, వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్న తెలంగాణకు తక్షణం రూ.10 కోట్లు వరద సాయంగా అందిస్తున్నట్టు సీఎం పళనిస్వామి తెలిపిన సంగతి విదితమే. ‘భారీ వర్షాలు, అంచనాలకుమించి వచ్చిన వరదతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరుగడం దురదృష్టకరం. ప్రాణాలు కోల్పోయిన వారికి తమిళనాడు ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి వ్యక్తంచేస్తున్నాం.

ఈ ఆపత్కాలంలో తెలంగాణ ప్రజలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ముందస్తుగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి వెంటనే రూ.10 కోట్లు అందించాల్సిందిగా సంబంధిత అధికారును ఆదేశించాను. వరద ప్రాంతాల్లోని ప్రజలకు పంపిణీ చేసేందుకు బ్లాంకెట్లు, దుప్పట్లు, ఇతర సామగ్రి కూడా పంపాలని సూచించాను. ఇక ముందు తెలంగాణకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని పళనిస్వామి లేఖలో పేర్కొన్నారు.

మరో రెండు రోజులు..భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ,అధికారులు అప్రమత్తం

ఇక రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రోసారి భారీ వ‌ర్షం ముంచెత్తింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో కురిసిన కుండ‌పోత వాన‌కు రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీల్లోకి వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. భారీ వాన‌ల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. న‌గ‌ర ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం 100కు డ‌య‌ల్ చేయాల‌ని సూచించారు.

లోత‌ట్టు ప్రాంతాల‌తో పాటు శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. హుస్సేన్ సాగ‌ర్ నిండు కుండలా మార‌డంతో దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. లోయ‌ర్ ట్యాంక్ బండ్ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష, పాక్షికం అయితే రూ. 50 వేలు, ప్రతి ఇంటికి రూ. 10 వేల ఆర్థిక సాయం, మున్సిప‌ల్ శాఖ‌కు తక్షణం రూ. 550 కోట్లు విడుద‌ల చేయాలని తెలంగాణ సీఎం ఆదేశాలు

ఆర్‌కే పురం, సైదాబాద్‌, దిల్‌సుఖ్ న‌గ‌ర్‌, చైతన్య‌పురి, స‌రూర్‌న‌గ‌ర్‌, కొత్త‌పేట‌, సంతోష్ న‌గ‌ర్‌, చార్మినార్‌, ఫ‌ల‌క్‌నూమా, జూపార్క్, అఫ్జ‌ల్‌గంజ్‌, బ‌హ‌దూర్‌పురా, మెహిదీప‌ట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి, మ‌దాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట‌, బేగంపేట‌, సికింద్రాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్‌, బోయిన్‌ప‌ల్లి, అల్వాల్‌, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, ఉప్ప‌ల్‌, కుషాయిగూడ‌, నాగారం, ద‌మ్మ‌యిగూడ‌, చ‌ర్ల‌ప‌ల్లి, న‌ల్ల‌కుంట‌, అంబ‌ర్‌పేట‌, ముషీరాబాద్‌, నారాయ‌ణ‌గూడ‌, కోఠి, ల‌క్డీకాపూల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లాల్లో రిజ‌ర్వాయ‌ర్ల వ‌ద్ద ఉన్న‌ ప‌ర్యాట‌క శాఖ బోట్ల‌ను హైద‌రాబాద్‌కు ప్ర‌భుత్వం తెప్పించింది. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు బోట్ల‌ను ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. మొత్తం 53 బోట్ల‌ను హైద‌రాబాద్‌కు తెప్పించింది. రాష్ర్ట ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు 5 బోట్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పంపింది. వ‌ర్షాభావ ప్రాంతాల్లో బోట్ల‌ను ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచ‌నుంది.

ఇక హైదరాబాద్‌ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నగర మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్‌ఎంసీ పరిధి ఎమ్మెల్యేలుదీనిలో పాల్గొన్నారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తక్షణ సాయం అందించాలని కేటీఆర్‌ సూచించారు. షెల్టర్ క్యాంపులను పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. ఈ క్రమంలో వరద సహాయక చర్యల్లో భాగంగా 2 నెలల వేతనం ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ పరిధి ఎమ్మెల్యేలు, ఎంపీల నిర్ణయించారు.