SLBC (Credits: X)

Hyderabad, Feb 23: తెలంగాణలోని (Telangana) నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి జరుగుతున్న సహాయక చర్యలలో భారత సైన్యం చేరింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో భారత సైన్యం కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఇక సొరంగం వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

సొరంగంలో చిక్కుకున్న వారు వీరే

శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో సొరంగంలో చిక్కుకున్న వారు వీరే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జార్ఖండ్ కు చెందిన సంతోష్ సాహు, అనూజ్ సాహు, సందీప్ సాహూ, జక్తా ఎక్సెస్, జమ్మూకాశ్మీర్ కు చెందిన సన్నీసింగ్, పంజాబ్ కు చెందిన సన్నీసింగ్ ఉన్నట్లుగా తెలిపారు.

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం.. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కేథలిక్ చర్చి అధిపతి