Hyderabad, January 10: తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్లకు నామినేషన్లు (Nominations) దాఖలు చేసే గడువు శుక్రవారం ముగిసింది. ఎన్నికలు జరిగే (Municipal Polls) మొత్తం 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు గానూ భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కలిసి ఇప్పటివరకు సుమారు 15 వేల మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. రేపటి నుంచి వీటి పరిశీలన ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 వరకు గడువు ఉంది. టీఆర్ఎస్ గెలుపుపై సీఎం కేసీఆర్ ధీమా!
ఇదిలా ఉండగా కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ (Karimnagar Municipal corporation) కోసం నామినేషన్ల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. కరీంనగర్ కార్పోరేషన్ లోని 3, 24, 25 డివిజన్లలో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయంటూ సింగిల్ జడ్జి బెంచ్ వద్ద రిట్ పిటిషన్ దాఖలవడంతో న్యాయస్థానం ఈ కార్పోరేషన్‌కు నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, ఇప్పటికే అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అప్పీల్ చేస్తూ అత్యవసర పిటిషన్ వేయడంతో, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చి, ఎన్నికలకు మార్గం సుగమం చేసింది. దీంతో గురువారం రాత్రే ఎన్నికల సంఘం కరీంనగర్ కార్పోరేషన్‌కు నోటిఫికేషన్ వెలువరించింది. ఈ క్రమంలో శుక్రవారం నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు. ఈ ఒక్క కార్పోరేషన్‌కు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 12 వరకు గడువు ఉంది.