Etela Rajender Joins BJP: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు తథ్యమన్న కేంద్ర మంత్రి, బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్, కండువా కప్పి ఆహ్వానించిన ధర్మేంద్ర ప్రధాన్, ఈటెలతో పాటు కాషాయపు కండువా కప్పుకున్న పలువురు నేతలు
Etela Rajender Joins BJP (Photo-ANI)

New Delhi, June 13: అనుకున్న ముహూర్తానికే తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అనుచరులు..సన్నిహితులతో కలిసి కాషాయ కండువా (Etela Rajender Joins BJP) కప్పుకున్నారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు.

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై రమేష్ రాథోడ్ అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని తన అనుచరులు, అభిమానులతో మాట్లాడిన తర్వాతనే రమేష్ రాథోడ్ బీజేపీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో కాషాయం బలపడనుంది. గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరనుండడంతో ఖానాపూర్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా, ఈనెల 14న నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి, హుజూరాబాద్‌లో కౌర‌వుల‌కు, పాండ‌వుల‌కు యుద్ధం జరగబోతుందని తెలిపిన రాజేందర్

విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తాని ఈటల (Former Telangana minister Etela Rajender) చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ నీ అన్ని గ్రామాలకు తీసుకొని వెళ్ళడానికి శ్రమిస్తానని వెల్లడించారు. దక్షిణ భారత దేశంలో తెలంగాణ లో బీజేపీ నీ విస్తరించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. బీజేపీ లోకి స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్న నాయకులందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.

ప్రగతి భవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ చదివే వారి చరిత్రేంటో ప్రజలకు తెలుసు, హుజూరాబాద్ నుంచే తెలంగాణ ఆత్మగౌరవ బావుటా జెండా ఎగరవేస్తాం, ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్‌లో రోడ్ షో నిర్వహించిన ఈటెల రాజేందర్

ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఈటల రాజేంద్రర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు.

నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే..ఆయన తండ్రి కంటే ఎక్కువని తెలిపిన మంత్రి తన్నీరు హరీష్ రావు, ఈటలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన తెలంగాణ ఆర్థికమంత్రి

కాగా, ఈ రోజు ఉదయం 5 గంటలకే శామీర్ పేట్‌లోని త‌న‌ నివాసం నుంచి ఈట‌ల‌ బయలుదేరారు. ఈ రోజు ఉద‌యం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఆయ‌న ప‌లువురు బీజేపీ కీల‌క నేత‌ల‌ను క‌లిసే అవ‌కాశం ఉంది. రేపు ఈట‌ల తిరిగి హైద‌రాబాద్ రానున్నారు.