Corona in TS: తెలంగాణలో తొలి కోవిషీల్డ్ టీకా అందుకోనున్న గాంధీ ఆసుపత్రి పారిశుధ్య కార్మికుడు; రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 276 కేసులు నమోదు
పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ యొక్క తొలి డోసును ఆరోగ్యశాఖ సిబ్బందికి కాకుండా, గాంధీ ఆసుపత్రిలో పనిచేసే శానిటైజేషన్ వర్కర్లకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే టీకా పంపిణీలో....
Hyderabad, January 14: ఈ శనివారం రాష్ట్రంలో కరోనా నివారణ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ యొక్క తొలి డోసును ఆరోగ్యశాఖ సిబ్బందికి కాకుండా, గాంధీ ఆసుపత్రిలో పనిచేసే శానిటైజేషన్ వర్కర్లకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే టీకా పంపిణీలో ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా ఇవ్వాలని, ఒక కేంద్రంలో కేవలం 30 మందికి మాత్రమే టీకా అందించాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇక భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ డోసును తొలి రోజు ఎవరికీ ఇవ్వబడదని అధికారులు సూచించారు.
రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 28,894 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 276 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 588 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73,79,538 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 290,916కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 53 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 23, మేడ్చల్ నుంచి 18, కరీంనగర్ నుంచి 16 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 1 కొవిడ్ మరణం సంభవించింది.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,572కు పెరిగింది. అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 238 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 284,849 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jan 14, 2021 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

