Hyderabad, July 31: రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాలో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Rain Alert in Telugu States) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో (Telangana) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరఠ్వాడా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మూడు రాజధానులకు సై, రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఆ ఏడు జిల్లాల్లోనే 90 వేలకు పైగా కేసులు, ఏపీలో మరో 10376 కొత్త కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 1,38,038కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, 1,349కి పెరిగిన మృతుల సంఖ్య
తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 13 °N అక్షాంశం వెంబడి ఉపరితల ద్రోణి 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం (AP meteorological department) వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు ప్రేర్కొంది. దీనివల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర, దాని పక్కనే ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 5.8కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తుకు వెళ్లే కొలది ఇది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి, కోత జోన్‌తో కలసినట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా మరో 1986 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 62 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 519కి పెరిగిన కరోనా మరణాలు
ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(శుక్రవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.